Begin typing your search above and press return to search.
బాబు కాదు జిమ్సన్.. తుస్సుమన్న బెలూన్ మజిల్స్
By: Tupaki Desk | 2 April 2017 10:40 AM GMTఏపీలో అధికారం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం.. వెంకయ్యనాయుడితో ఒకే కంచం, ఒకే మంచం అన్నంత దోస్తీ.. మోడీతోనూ ఓకే.. మీడియా మొఘల్స్ - పొలిటికల్ హిట్ మెన్ల అండ ఉండనే ఉంది. దీంతో పలుకుబడి - అధికారం - డబ్బు అన్నీ ఉండడంతో చంద్రబాబు ఒక ప్రబల శక్తిలా కనిపించారు ఇంతకాలం. ఆ మబ్బులు కమ్మేయడం వల్లే వైసీపీ నుంచి కొందరు ఎమ్మెల్యేలు కంగారు కంగారుగా టీడీపీలోకి వచ్చారు. ప్రాధాన్యం దక్కినా దక్కకపోయినా మళ్లీ వెనక్కు వెళ్లలేక పడుంటున్నారు. ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు పార్టీపై విపరీతమైన గ్రిప్ ఉన్నట్లుగా అనిపిస్తుంది.. ఆయన మాటను జవదాటేవారు, గీసిన గీతను దాటేవారు ఎవరూ ఉండరు అన్నంతగా అనిపిస్తుంది. కానీ.. తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించడంతో మొత్తం రంగు బయటపడిపోయింది. చంద్రబాబు మాటకు పార్టీ నేతలు ఎంతగా విలువిస్తారో తేలిపోయింది.. అసలు ఎమ్మెల్యే పదవుల అవసరం, టీడీపీ పార్టీ కట్టుబాట్లు వంటివేమీ లేవని.. తమ ప్రయోజనాలు నెరవేరకపోయినా చంద్రబాబునైనా టీడీపీ నేతలు కేర్ చేయరని అర్థమైపోయింది. పార్టీ సమావేశాల్లో... ఎమ్మెల్యేలకు ర్యాంకింగులు ఇచ్చినప్పుడు చంద్రబాబు ఎన్ని చీవాట్లు పెట్టినా నోరెత్తకుండా ఉన్న నేతలు కూడా ఇప్పుడు తృణ ప్రాయంగా తమ ఎమ్మెల్యే పదవులను వదులుకోవడానికి సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా తెలుగుదేశంలోనే కానసాగుతున్నవారు కూడా పార్టీకి రాజీనామాలు చేసేస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే అర్థమవుతుందేమిటి... చంద్రబాబుపై ఎవరికీ గట్టి నమ్మకాలు లేకపోవడం... బలమైన ప్రత్యామ్నాయ పార్టీ వైసీపీ ఉండడం.. ఇన్నాళ్లూ మౌనంగా భరించిన నిరాదరణ, ఒత్తిడిని ఇక భరించలేమన్న ఆవేదన వంటివన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే.. చంద్రబాబుది బలం కాదు, వాపు. అదేదో సినిమాలో గాలి బుడగలను కండల్లా కట్టుకున్న జిమ్సన్(అలీ) టైపు బలమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాదు... చంద్రబాబు అనుకుంటున్నట్లుగా టీడీపీ నేతలంతా ఆయన చేతిలో లేరు.. అధికార పార్టీ కాబట్టి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికలకు అంచనాలు, సమీకరణాల బట్టి అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నారు.. ఇంతలోనే మంత్రివర్గ విస్తరణతో చంద్రబాబు అసలు రంగు బయటపడిపోయింది.
రాజీనామా చేయడం అంటే ఒకప్పుడు చాలా పెద్ద విషయం. చాలామంది రాజీనామా చేస్తామని బెదిరిస్తారే కానీ చేయరు. తెగువ.. బాగా ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఉన్న నేతలే అలా రాజీనామాలు చేసేవారు. కానీ... తాజాగా ఒక్క మంత్రివర్గ విస్తరణకే టీడీపీలో దాదాపు పది మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధమవడంతో చంద్రబాబుకే షాక్ తగిలింది.
విశాఖ పట్నంలోని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని, గన్ మెన్లను పంపించేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన ఈ రోజు రాజీనామా చేస్తారని తెలుస్తోంది. అలాగే... పశ్చిమగోదావరిలో చింతమనేని ప్రభాకర్ ఇప్పటికే రాజీనామా చేశారు. కృష్ణాలో బొండా ఉమ రాజీనామా యోచనలోనే ఉన్నారు. గుంటూరులో ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావులు కూడా రాజీనామా చేస్తామంటున్నారు. ఈ ఉదయం మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం నేరుగా చంద్రబాబు వద్దకు వెళ్లిన యరపతినేని, ఇక రాజీనామా చేస్తానని స్వయంగా చంద్రబాబుతోనే వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయమూ తీసుకోవద్దని, మరో రకంగా న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని.. అయినా ఆయన విసురుగా బయటకు వచ్చేశారని తెలుస్తోంది.
శ్రీకాకుళంలో గౌతు శివాజీ స్వయంగా రాజీనామా చేయకపోయినా ఆయన కుమార్తె, ఆ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు శిరీష రాజీనామాకు సిద్ధపడ్డారు. మరోవైపు మంత్రి పదవి నుంచి తప్పించారన్న కోపంతో బొజ్జల గోపాలకృష్నారెడ్డి కూడా రాజీనామ చేశారు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే చంద్రబాబు ప్రాబల్యం తగ్గిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది. అంతేకాదు.. రాష్ర్టంలో ఇంకో బలమైన ప్రత్యామ్నాయ పార్టీ ఉందన్న ధైర్యం కూడా కొందరిలో కనిపిస్తోంది. కొందరు మాత్రం కొత్తగా వస్తున్న పార్టీలపై దింపుడు కళ్లెం ఆశలతోనూ రాజీనామాకు తెగిస్తున్నారు. మొత్తానికి ఇంతకాలం జిమ్ సన్ రేంజిలో బిల్డప్ ఇచ్చిన చంద్రబాబు కండ బలం మొత్తం మంత్రి వర్గ విస్తరణ అనే ఒక్క సూదితో తుస్సుమనిపోయింది.
- గరుడ
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/