Begin typing your search above and press return to search.
ఫైర్ బ్రాండ్ల దెబ్బకు పాలేరు ఉక్కిరిబిక్కిరి ఖాయం
By: Tupaki Desk | 11 May 2016 7:09 AM GMTతెలంగాణలో తాజాగా జరుగుతున్న పాలేరు ఉప ఎన్నిక ప్రచార పర్వంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఇప్పటివరకూ జరిగిన ప్రచారానికి భిన్నమైన ప్రచారం నేటి నుంచి షురూ అవుతుందన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార.. విపక్షాలు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
ఇప్పటివరకూ పేలిన విమర్శల తూటాలకు మించి ఈ రోజు నుంచి మాటలు మంట పుట్టిస్తాయని చెప్పొచ్చు. ఎందుకంటే.. అధికార..విపక్షాలకు చెందిన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న నేతలు పాలేరు ఉప ఎన్నిక ప్రచారబరిలోకి దిగనుండటమే దీనికి కారణం. టీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ గా.. తన మాటలతో ముచ్చమటలు పోయించే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలోకి అడుగు పెట్టనున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే చాలు.. అంతెత్తున ఎగిరిపడే ఆయన కానీ ప్రచారంలోకి దిగితే ఆయన మాటలు ఎలా పేలతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదిలా ఉంటే.. ఈ ఉప ఎన్నికల్లో విపక్షాల తరఫున తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత.. కేసీఆర్ అండ్ కో అంటే చాలు చెలరేగిపోయే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం బుధవారం నుంచి పాలేరు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్నారు. వీరే కాక.. రేవంత్ కు తోడుగా టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావు.. సండ్ర వెంకట వీరయ్యలు కూడా ప్రచారం చేయనున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పుడు ఏ రెండు వర్గాలు అయితే పోటాపోటీగా తిట్టుకోనున్నాయో.. వారంతా సార్వత్రిక ఎన్నికల వరకూ ఒకే పార్టీకి చెందిన నేతలే కావటం గమనార్హం. ఈ రోజున టీఆర్ ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన తుమ్మల కావొచ్చు.. ఆయనకు అండగా నిలుస్తూ ప్రచారం చేసేందుకు వస్తున్న తలసాని కావొచ్చు.. వీరిద్దరి మీద ఫైర్ అయ్యేందుకు సిద్ధమవుతున్న రేవంత్.. నామా.. సండ్రలు అంతా ఒకే పార్టీకి చెందిన వారే కావటం గమనార్హం. కొద్ది నెలల క్రితం వరకూ భుజాలు భుజాలు రాసుకుపూసుకొని తిరిగిన నేతలు ఈ రోజు ఆగర్భ శత్రువుల మాదిరి మాటలు తూటాలు విసురుకోవటానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నిక రాజకీయం మరింత హాట్ హాట్ గా మారుతుందనటంలో సందేహం లేదు.