Begin typing your search above and press return to search.
కొత్త దారి వెతుక్కుంటున్న టీడీపీ నేతలు..
By: Tupaki Desk | 5 Aug 2021 10:40 AM GMTఏపీలో రాజకీయం రంగులు మారుతోంది. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షం కూడా బలంగా ఉంది. అయితే వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కనీస విజయాలు దక్కడం లేదు.దీంతో ఏపీలో అధికార పార్టీకి తిరుగులేకుండా పోతుంది. ఎన్నిక ఏదైనా గెలుపు మాదే అన్నట్లు వైసీపీ దూసుకుపోతుంది. ఈ తరుణంలో అధికార పార్టీకి ధీటైన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ప్రభావం కొంత కూడా ప్రభావం చూపకపోవడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. తమ భవిష్యత్ కోసం కొందరు నాయకులు తలోదారి చూసుకుంటున్నట్లు సమాచారం.
ఇప్పుడు టీడీపీ నుంచి ఇతర పార్టీలోకి వెళితే ఎంతో కొంత లాభపడాలి. అంటే అధికార పార్టీలోకి జాయిన్ అవ్వాలి. కానీ ఇప్పటికే వైసీపీ హౌస్ ఫుల్ అయింది. ఓవర్ లోడ్ తో ఉన్న ఆ పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్నవారికే ప్రాధాన్యం దక్కడం లేదన్న వాదన ఉంది. ఇప్పుడు కొత్తగా చేరితే ఏం లాభముంటుందని ఆలోచిస్తున్నారు. అయినా కొత్తగా టీడీపీ నుంచి వచ్చేవారికి రానివ్వడం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. దీంతో టీడీపీలోని నాయకులు బీజేపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.
2019 నుంచి జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నకల్లో టీడీపీ కొన్ని సీట్లైనా గెల్చుకోలేకపోయింది. అంతేకాకుడా సింగిల్ డిజిట్ కు పడిపోవడంతో పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదని అర్థమైంది. ఎంత గింజుకున్నా పార్టీ ఇప్పట్లో పటిష్టమయ్యే అవకాశం కనిపించడం లేదు. మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనూ పోటీకీ రెడీ అన్నట్లు సంకేతాలిస్తున్నారు. అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. ఇక ఆయన కుమారుడు లోకేశ్ పై ఎవరికీ నమ్మకం కలగడం లేదు. ఆయన బాధ్యతలు తీసుకున్న తరువాత ఏమాత్రం మార్పు కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో ఉండే భవిష్యత్ ప్రశ్నార్థకమే అన్నట్లు భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. దీంతో అవకాశముంటే అధికార పార్టీ, లేకుంటే బీజేపీలో చేరేందుకు యత్నిస్తున్నారు. ఇలా పక్క చూపులు చూస్తున్నవారిలో పార్టీ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో గంటా శ్రీనివాసరావు పేరు ప్రచారంలోకి వచ్చింది. ఆయన వైసీపీలోకి చేరుతారంటూ బాగా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ కొందరు సీనియర్ నేతలు మాత్రం అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందో, లేదో తెలియదు. కానీ ఏదో ఒక పదవి మాత్రం వరిస్తుంది. దీంతో ఈ మూడు సంవత్సరాల కాలంలోనైనా ప్రజలకు ఏదో విధంగా దగ్గరిగా కావచ్చనే ఆలోచనలో ఉన్నారట. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లవచ్చని అనుకుంటున్నారట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కంటే బీజేపీ యే బెటర్ అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఏపీలో బీజేపీ పరిస్థితి కూడా పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. ఒకటో, రెండో ఆందోళనలు తప్ప ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశాలు కనిపించడం లేదు. అయితే జగన్ కేంద్రానికి అనునాయులుగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వం జారీ చేసే నిధుల్లో కీలకంగా ఉండే అవకాశాలుంది. దీంతో కమలం పార్టీ ఎంతో కొంత మేలు చేస్తోందని టీడీపీ నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేతలు ఆలోచిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా చంద్రబాబు పార్టీ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. వరుస ఓటమిలతో వచ్చే ఎన్నికల వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అయితే కింది స్థాయి కార్యకర్తలు మాత్రం తమ భవిష్యత్ అంధకారంలో పడకముందే ఓ దారి చూసుకోవాలని అనుకుంటున్నారట.