Begin typing your search above and press return to search.
జగన్ పై దాడి ఘటనపై టీడీపీ రాజకీయం!
By: Tupaki Desk | 25 Oct 2018 2:11 PM GMTఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయ కోణంలో జరిగిన దాడి అని - ఈ దాడికి గల కారణాలు - దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాలు తెలుసునేందుకు ఏపీ ప్రభుత్వం తక్షణ విచారణ చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రతిపక్ష నేత జగన్ పై ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు ఖండించారు. ఈ హత్యాయత్నంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఐఎస్ ఎఫ్ ను ఆదేశించారు. తక్షణమే దర్యాప్తు మొదలు పెట్టాలన్నారు. ఈ ఘటన అత్యంత అమానుషమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇది తీవ్రమైన ఘటన అని, ప్రజాస్వామ్యంలో ఇటువంటివి తగవని పవన్ అన్నారు. గాయం నుంచి జగన్ మోహన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పవన్ ఆకాంక్షించారు.
జగన్ పై దాడిని తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్వీట్ చేశారు. దాడికి పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షించాలని - జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ తరహా దాడులు పిరికిపందల చర్యగా హైదరాబాద్ ఎంపీ - ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ అభివర్ణించారు. జగన్ పై దాడి పూర్తిగా భద్రతా వైఫల్యమన్నారు. ఒక మనిషి కత్తితో ఎయిర్ పోర్టు లోపలికి ఎలా వెళ్లగలిగాడని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రతిపక్షాలు లేకుండా చేసే కుట్రలో భాగంగానే జగన్ పై దాడి జరిగిందని ఏపీ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అమిత్ షా - తనతోపాటు జగన్ పై దాడులు ఏపీలో ప్రజాస్వామ్యం - శాంతిభద్రతలు ఏస్థాయిలో ఉన్నాయో తెలిపేందుకు నిదర్శనమన్నారు. ఈ దాడిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఉమెన్ చాందీ - ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డిలు ఖండించారు. ఈ దాడిపై సమగ్ర విచారణ చేయాలని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.
ఓ వైపు రాష్ట్ర స్థాయి - దేశస్థాయి నాయకులు - నేతలు జగన్ పై దాడిని ఖండిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించి టీడీపీ నేతల బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.దాడి చేసిన శ్రీనివాస్...జగన్ కు వీరాభిమాని అని - జగన్ తో శ్రీనివాస్ ఉన్న కటౌట్లు ఉన్నాయని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా ఈ దాడి జరిగిందని, జగన్ పై దాడి జరిగిన తర్వాత ఆసుపత్రిలో చేరకుండా - పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నవ్వుకుంటూ హైదరాబాద్ వెళ్లారని విమర్శించారు. కత్తికి విషం ఉంటుందని వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేశారని, అటువంటపుడు విశాఖలోని ఆసుపత్రికి జగన్ ఎందుకు వెళ్లలేదని మంత్రి కాలవ శ్రీనివాసులు లాజిక్ లు మాట్లాడారు. కేంద్ర భద్రతా సిబ్బంది ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగిందని, కేంద్రంపై ఈ దాడి ఘటనను నెట్టే ప్రయత్నం చేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు ఏదో బలమైన కుట్ర జరుగుతోందని సింపతీ కొట్టేసేందుకు ట్రై చేశారు.
జగన్ పై దాడి ఘటనలో టీడీపీ నేతల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము ప్రజా ప్రతినిధులనే బాధ్యత లేకుండా...జగన్ పై దాడి ఘటనను అపహాస్యం చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ తరహాలో దాడి జరిగినపుడు బాధితుడైన జగన్ కు సానుభూతి తెలపడం కనీస మానవత్వం. కానీ, టీడీపీ నేతలు ఇందుకు భిన్నంగా....కుటిల రాజకీయాలు చేసేందుకు యత్నించడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఘటనపై విచారణ అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తాయని, గుమ్మడికాయల దొంగ తరహాలో టీడీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని అంటున్నారు. తప్పుడు వీడియోలు ప్రచారం చేసి...దీనిని రాజకీయం చేసేందుకు టీడీపీ నేతలు యత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని అంటున్నారు.