Begin typing your search above and press return to search.
చినబాబు ఉండగా చంద్రబాబు దండగా?
By: Tupaki Desk | 5 Dec 2016 4:04 PM GMTతెలుగుదేశం పార్టీలో పరిస్థితులు ఇటీవల కాలంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చాలామంది నేతలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. దీంతో మెల్లమెల్లగా చంద్రబాబుకు పార్టీపై, ప్రభుత్వంపై పట్టు తగ్గుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎంపీలు - చివరికి అధికారులు కూడా ఆయన మాటను ఖాతరు చేయడం లేదని చెబుతున్నారు.
పార్టీలో ప్రస్తుతం క్రమశిక్షణ లోపించిందని, ఎవరి దారి వారిదే అన్నట్లుగా తయారయిందని పేర్కొంటున్నారు. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీసేలా కొంతమంది మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరు ఉన్నా సరే వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడం వల్లనే వారి అరాచకాలు ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు. దీనంతటికీ కారణం లోకేశేనని... లోకేశ్ అండ దొరికినవారు ఇప్పుడు చంద్రబాబును లెక్క చేయడం లేదని చెబుతున్నారు. ఇలాంటి వారంతా ముఠాగా మారి చంద్రబాబుకు చాలా విషయాలు తెలియకుండా చేస్తున్నారని.... నిజంగా ఆయన పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ జరిగే విషయాలు తెలిస్తే ఏమాత్రం సహించరని.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఊరుకోరని... ఇదంతా చంద్రబాబకు తెలియకుండా జరుగుతోందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో చంద్రబాబును పక్కనపెట్టి చినబాబు లోకేష్ తో దోస్తీ చేసి ఇష్టారాజ్యం సాగిస్తున్నవారు పార్టీలో ఎక్కువవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమధ్యకాలంలో ఎమ్మెల్సీలు - నామినేటెడ్ పదవులు పొందిన వారు ఎక్కువ మంది చినబాబు అనుచరులే. కొంత మంది ఎమ్మెల్యేలు సైతం చినబాబును కాకాపట్టి మరీ వారి పబ్బం గడుపుకుంటున్నారు.
మరోవైపు పార్టీలో నేతల సంఖ్య పెరగడం.. వచ్చే ఎన్నికల నాటికి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేకపోవడం... రాష్ర్టంలో కుల రాజకీయాలు వంటి కారణాలతో ఏ నాయకుడినీ వదులుకోరాదని చంద్రబాబు అనుకుంటున్నారు. దీంతో ఏం చేసినా ఏం కాదులే అని రెచ్చిపోతున్నారట తెలుగు తమ్ముళ్లు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/