Begin typing your search above and press return to search.
వైఎస్ బొమ్మే టీడీపీకి దిక్కయ్యింది..
By: Tupaki Desk | 19 Nov 2018 9:48 AM GMTరాజకీయాల్లో నీతి నియమాలు.. నిర్లజ్జలు ఉండవని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నాడని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ తో కలవడమే పెద్ద పొరపాటుగా కేటీఆర్ - కేసీఆర్ అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.. బాబు అవకాశం దొరికితే వైసీపీ తో కూడా పొత్తు పెట్టుకుంటాడని తాజాగా కేటీఆర్ చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు అవకాశావదం తెచ్చిన తంటా ఇప్పుడు ఆయన వైరి పక్షాలకు అనుకోని వరంలా మారింది.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదినుంచి తీవ్రంగా ద్వేషించే వ్యక్తిగా చంద్రబాబుకు పేరుంది. బాబు మావోయిస్టుల దాడిలో గాయపడితే అండగా నిలిచి పరామర్శించిన గొప్పతనం వైఎస్ ది. కానీ నేడు ఆయన కుమారుడు జగన్ పై దాడిని కూడా తన స్వలాభం కోసం వాడుకుంటున్న దైన్యం చంద్రబాబు ది అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.. వైఎస్ క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలు వదిలేసి మానవతా దృక్పథం తో స్పందిస్తాడని.. కానీ ప్రతీ దాంట్లోనూ రాజకీయం కోసం స్వలాభం కోసం చూసే నైజం బాబుది అని ఆడిపోసుకుంటున్నారు..
ఇప్పుడు తెలంగాణలో అనైతిక పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు అదిరిపోయేలా పంచ్ ఇస్తున్నారు టీఆర్ ఎస్ నేతలు.. మహానేత వైఎస్ ఫొటోలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలను - సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేస్తూ మళ్లీ రాజన్న రాజ్యం తెస్తామని చెబుతున్నారు.
అయితే మహాకూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించిన సీట్లలో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు కూడా వైఎస్ - కాంగ్రెస్ నేతల బొమ్మలను తమ ప్రచార ఫ్లెక్సీల్లో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పలువురు తెలుగుదేశం నేతలు వైఎస్ ఆర్ బొమ్మను వాడేసుకుంటున్న వైనంపై టీఆర్ ఎస్ నేతలు బాబును ఏకిపారేస్తున్నారు. బాబు తీవ్రంగా వ్యతిరేకించే వైఎస్ ను కూడా వాడుకొని ఓట్లు అడుగుతున్న ఖర్మ బాబుకు పట్టిందని ఆడిపోసుకుంటున్నారు.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షవైన వైసీపీ పార్టీ పుట్టిందే వైఎస్ మరణం నుంచి.. వైసీపీకి కర్తకర్మ క్రియ అంతే వైఎస్సే.. ఏపీలో టీడీపీకి వ్యతిరేకమైన వైఎస్ పార్టీని. వైఎస్ ను తెలంగాణలో మాత్రం టీడీపీ ప్రచారానికి వాడుకోవడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. అవకాశవాదం అంటే చంద్రబాబుదే అని విమర్శిస్తున్నారు. బాబు అవకాశం వస్తే వైసీపీతో కూడా పొత్తు పెట్టుకుంటాడన్న కేటీఆర్ మాటలను దీన్ని బట్టి నిజమని విమర్శకులు దెప్పిపొడుస్తున్నారు.