Begin typing your search above and press return to search.
రామోజీ మనకు సాయం చేయరా బ్రదర్?
By: Tupaki Desk | 4 March 2016 5:16 AM GMTఏపీ టీడీపీ తమ్ముళ్లు పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అధినేత స్టార్ట్ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ తో తమకు తిరుగులేకుండా ఉంటుందన్న భావన నాలుగు రోజుల కిందట వరకూ వినిపించిన వారు.. గడిచిన మూడు రోజులుగా తమ నేతల మీద జగన్ మీడియా సంస్థ తయారు చేస్తున్నకథనాలతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతున్న పరిస్థితి. వేలాది ఎకరాలు తమ్ముళ్లు కొల్లగొట్టేసినట్లుగా చెబుతున్న కథనాలు ఏపీలో హాట్ టాపిక్ గా మారటమే కాదు.. చంద్రబాబు సర్కారు ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసిన పరిస్థితి. ఇంతకాలం అవినీతికి వ్యతిరేకంగా పోరాడే తమను వేలెత్తి చూపించే సాహసం ఎవరూ చేయలేరంటూ చెప్పుకున్న చంద్రబాబు.. గడిచిన రెండు రోజుల్లో తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు చెబుతున్నారు.
దీని ప్రభావం గురువారం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించిందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే.. తెలుగు తమ్ముళ్లు కొందరు చేస్తున్న వాదన ఒకటి ఆసక్తికరంగా మారింది. జగన్ మీడియా తమను లక్ష్యంగా చేసుకొని ‘ఇరగదీస్తున్న’ ప్రస్తుత తరుణంలో తమకు దన్నుగా నిలిచే వారు లేరా? అన్న ప్రశ్న తమ్ముళ్లలో రేగుతోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వేళ.. ఆయన అవినీతి గురించి ఈనాడు ప్రత్యేక కథనాలు రాస్తే.. దానికి ప్రతిగా ఈనాడు అధినేత రామోజీపై మార్గదర్శి ఇష్యూను తెరపైకి తీసుకురావటం తెలిసిందే.
నాడు.. రామోజీకి చెందిన మార్గదర్శిని వైఎస్ టార్గెట్ చేస్తే.. ఆ వైఖరిని బాహాటంగా ఖండించటంతో పాటు.. రామోజీకి దన్నుగా తాము నిలిచామని.. కానీ.. ఇప్పుడు తమకు అండగా ఈనాడులో వార్తలు పెద్దగా రావటం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. తమను సమర్థిస్తూ పెద్ద పెద్ద కథనాలు ఈనాడులో రాకున్నా ఫర్లేదు.. జగన్ మీడియా చేస్తున్న ఆరోపణల్లో తమ వాదనల్ని వినిపించే ‘బాధ్యత’ కూడా తీసుకోరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రామోజీ కష్టకాలంలో తాము అండగా నిలిస్తే.. తాము ఇబ్బందులో ఉన్నప్పుడు రామోజీ కాస్తంత దన్నుగా ఉండరా బ్రదర్ అంటూ కొందరు టీడీపీ నేతలు సీనియర్ నేతల్ని అడుగుతున్న మాటలకు.. వారేం సమాధానం చెప్పలేకపోతున్నారట.