Begin typing your search above and press return to search.
అన్నొస్తున్నాడు!.. తమ్ముళ్లు క్యూ కట్టేస్తున్నారు!
By: Tupaki Desk | 25 Feb 2019 5:55 AM GMTనిజమేనండోయ్... అన్న వస్తున్నాడు. భారీ సంఖ్యలో తమ్ముళ్లు క్యూ కట్టేస్తున్నారు. ఇక్కడ అన్న అంటే ఎవరు? ఇంకెవరండీ బాబూ... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే. తమ్ముళ్లు అంటే వైసీపీ నేతలు కాదు... తెలుగు దేశం పార్టీ నేతలు. ఏపీ అసెంబ్లీతో పాటు సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైన వేళ... అధికార టీడీపీ నుంచి విపక్ష వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఇద్దరు ఎంపీలు - ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి షాకిస్తూ వైసీపీలో చేరిపోయారు కదా. జగన్ లండన్ టూర్ కు బయలుదేరడానికి ముందు ఈ తరహా చేరికలతో లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయం కళకళలాడిపోయిన సంగతి కూడా చూశాం కదా.
అయితే జగన్ లండన్ లో చదువుతున్న తన కూతురును చూసి వచ్చేందుకు బ్రిటన్ వెళ్లారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ కాస్తంత సైలెంట్ అయిపోయింది. అయితే ఈ సైలెన్స్ ఎల్లుండితో బద్దలు కానుంది. ఎందుకంటే... లండన్ వెళ్లిన జగన్ ఎల్లుండి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ వెంటనే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిపోయేందుకు చాలా మంది టీడీపీ నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే... మరోమారు లోటస్ పాండ్ లో సందడి నెలకొంటుండగా... టీడీపీలో నైరాశ్యం రాజ్యమేలుతుందన్న మాట. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో సొంత ఇల్లుతో పాటు పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్... ఈ నెల 14ననే ఆ ఇంటిలోకి గృహ ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అనివార్య కారణాలతో నాటి గృహ ప్రవేశం వాయిదా పడిపోయింది.
ఇప్పుడు తన లండన్ టూర్ ను కూడా ముగించేసుకుని తిరిగి వస్తున్న జగన్... ఎల్లుండే తన కొత్త ఇంటిలోకి గృహ ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజకీయ రంగానికి చెందిన పలువురు కీలక ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇదే సందర్భంగా టీడీపీకి చెందిన చాలా మంది కీలక నేతలు వైసీపీలోకి చేరనున్నారట. ఇప్పటికే ఓ ఎమ్మెల్యే వైసీపీలోకి చేరిపోతున్నట్లుగా ప్రకటించేయగా - ఇంకా చాలా మంది నేతలు అదే బాటలో పయనించేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. వీరిలో కొందరికి ఇప్పటికే వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా... మరికొందరు వైసీపీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. మొత్తంగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు - ఎమ్మెల్యేలను కూడా కాపాడుకోలేక టీడీపీ తల పట్టుకోగా... ఇప్పుడు జగన్ రాగానే కొత్తగా వైసీపీలోకి కొత్తగా జరగబోయే చేరికలపై తీవ్ర ఆందోళనలో కూరుకుపోయినట్లుగా తెలుస్తోంది.