Begin typing your search above and press return to search.
టీడీపీ పండుగకు అడ్వాన్స్ క్లారిటీ
By: Tupaki Desk | 28 March 2016 6:44 AM GMTఈ నెల 29వ తేదీతో తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవం పూర్తిచేసుకునే సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతోషంలో నిండిపోతున్నాయి. రాష్ట్ర - జిల్లా - నియోజక వర్గ - మండల స్థాయిల్లో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రాంతీయ పార్టీగా స్ధాపించబడ్డ టీడీపీ జాతీయపార్టీగా అవతరించడం గర్వించదగ్గ విషయంగా భావిస్తున్న టీడీపీ నేతలు పార్టీ పండుగ అయిన మహానాడు నిర్వహణ విషయంలో కొత్త సమాచారం వెలువరించారు.
టీడీపీలోని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం...తెలుగుదేశం పార్టీ మహానాడును ఈ ఏడాది గుంటూరులో నిర్వహించనున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా గత ఏడాది మహానాడును హైదరాబాద్ లో నిర్వహించారు. అయితే ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బాధ్యతను తాము తీసుకుంటామని గుంటూరు తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చారు. ఇందుకు చంద్రబాబు సరే అన్నట్టు తెలిసింది. దీంతో మే 27 - 28 - 29 తేదీల్లో గుంటూరులో మహానాడు జరగబోతోంది. మహానాడుకు తగ్గట్టుగా గుంటూరు జిల్లాలోని తెలుగుదేశం కార్యాలయాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఉగాదిలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని పార్టీ వర్గాలు చెప్పాయి.