Begin typing your search above and press return to search.
టీడీపీ మేనిఫెస్టో: చంద్రబాబుపై నిమ్మగడ్డ చర్యలు తీసుకోవాలి
By: Tupaki Desk | 28 Jan 2021 5:30 PM GMTపంచాయితీ ఎన్నికలంటేనే పార్టీ రహితంగా సాగుతాయి. పార్టీల గుర్తులు ఇందులో ఉండవు. గ్రామ స్వరాజ్యం కోసం అభివృద్ధి కోసం మన రాజ్యాంగంలో ఈ వెసులుబాటు కల్పించారు. అయితే పార్టీ రహితంగా సాగే ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడంపై అధికార వైసీపీ అభ్యంతరం తెలిపింది. దీన్ని నిబంధనల ఉల్లంఘనగా భావించి చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీ నిమ్మగడ్డను వైసీపీ డిమాండ్ చేసింది..
టీడీపీ మేనిఫెస్టో విడుదల చేయడం సరికాదని ఏపీ పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అన్నారు. పార్టీ రహితంగా సాగే పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తుందని.. చంద్రబాబుకు ఆ అధికారం ఎవరిచ్చారు? ఆయనపై నిమ్మగడ్డ చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఇలాంటి చర్యలకు పాల్పడినందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని వైసీపీ అధికారప్రతినిధి ఎమ్మెల్యే అంబటిరాంబాబు డిమాండ్ చేశారు.
ఏపీలో పంచాయితీ ఎన్నికలకు టీడీపీ తాజాగా మేనిఫెస్టోను విడుదల చేసింది. చంద్రబాబు స్వయంగా అమరావతిలో దీన్ని విడుదల చేశారు. ‘పల్లె ప్రగతి-పంచ సూత్రాల’ పేరుతో ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్థవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు.