Begin typing your search above and press return to search.

టీడీపీ మేనిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలివీ..

By:  Tupaki Desk   |   6 April 2019 9:54 AM GMT
టీడీపీ మేనిఫెస్టో విడుదల.. ముఖ్యాంశాలివీ..
X
ఉగాది పండుగను పురస్కరించుకొని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ‘మీ భవిష్యత్-నా బాధ్యత’ పేరుతో టీడీపీ మేనిఫెస్టోను అమరావతిలో రిలీజ్ చేయడం విశేషం. వైసీపీ అధినేత జగన్ తన పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయగానే అలెర్ట్ అయిన బాబు ఆగమేఘాల మీద టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేయడం విశేషం. దాదాపు జగన్ ప్రస్తావించిన అన్ని అంశాలను బాబు కవర్ చేయడం గమనార్హం.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఐదేళ్ల పాలన చూసి తమకు మరోసారి ఓటు వేయాలని చంద్రబాబు ప్రజలను కోరారు. ప్రపంచానికే మన మేనిఫెస్టో ఆదర్శం కావాలని ఆకాంక్షించారు. అవగాహన లేని వాళ్లు మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నారని.. ట్రాక్ రికార్డ్ లేని వాళ్లు ఏదో చేస్తామని చెబుతున్నారని బాబు వైసీపీకి పరోక్షంగా సెటైర్లు వేశారు. తాము ఈ ఐదేళ్లలో చెప్పిన దానికంటే 50శాతం ఎక్కువ సంక్షేమం చేశామని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో విత్తనాలు, ఎరువు అమ్మేవారని.. టీడీపీ పాలనలో అలాంటివి ఏవీ లేవని బాబు గుర్తు చేశారు.

రైతుల ఆదాయాన్ని 125శాతం పెంచామని.. రూ.24వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేశామని చంద్రబాబు వెల్లడించారు. రైతులకు అన్నదాత సుఖీభవ అందిస్తున్నామని.. దేశంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేసినట్లు చెప్పారు.

+ టీడీపీ మేనిఫెస్టోలోని ముఖ్యంశాలు..

*నిరుద్యోగ భృతి రూ.3వేలకు పెంపు

*పెన్షన్ రూ.3వేలకు పెంపు - అర్హత వయస్సు 65 నుంచి 60కు తగ్గింపు

*సాగుకు 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

*రూ.5వేల కోట్లతో గిట్టుబాటు ధరల స్థిరీకరణ ఫండ్

*ఏటా అన్నదాత సుఖీభవ పథకం అమలు

*రైతులకు వడ్డీ లేకుండా ఎంతైనా రుణాలు

*కోటి ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ డెవలప్ మెంట్

*మాదిగలు - రెల్లి - యానాది కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు

*ప్రతి మండల - పట్టణ కేంద్రాల్లో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు

*డ్వాక్రా మహిళలకు ఉచితంగా సెల్ ఫోన్లు

*చంద్రన్న బీమా రూ.5లక్షల నుంచి రూ10 లక్షలకు పెంపు

*సాగుకు 12 గంటల ఉచిత విద్యుత్ సరఫరా

*విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు

*వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం

*విదేశీ విద్య కోసం పేద విద్యార్థులకు రూ.20 లక్షలు

*ఆదివాసీల కోసం ప్రత్యేక బ్యాంక్ ఏర్పాటు

*ఇంటర్మీడియెట్ నుంచి విద్యార్థులకు ల్యాప్ టాప్ లు

*మత్స్యకారుల క్రాప్ హాలిడేకు రూ.10వేలు సాయం

*వడ్డెర - బ్రాహ్మణ వర్గాలకు ఎమ్మెల్సీ పదవులు

*విద్యుత్ వాహనాలను ప్రమోట్ చేస్తాం

*ప్రతీగ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు బీటీరోడ్డు

*పట్టణాల్లో తోపుడుబండ్లకు ఇబ్బందులు లేకుండా చేస్తాం.

*తిరుపతికి ఎలక్ట్రానిక్ హబ్ ఏర్పాటు

*వైద్యంలో రూ.5లక్షల వరకు ఉచిత సాయం.