Begin typing your search above and press return to search.
టీవీచానెల్స్ కు టీడీపీ భారీ ప్యాకేజీ.?
By: Tupaki Desk | 1 Nov 2018 8:38 AM GMTచంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. మీడియా మేనేజ్ మెంట్ కు రంగం సిద్ధం చేశారు. ఏపీలో జరిగే 2019 ఎన్నికలే లక్ష్యంగా మొత్తం మీడియా వ్యవస్థను తన గుప్పిట పెట్టేందుకు స్కెచ్ గీసినట్టు ప్రచారం జరుగుతోంది.
పసుపు బాస్ మీడియా మేనేజ్ మెంట్ లో దిట్ట.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆ రెండు పత్రికలు - తెలుగు టాప్ న్యూస్ చానెల్స్ ను గుప్పిటపట్టి వైఎస్ ను ఎంత అభాసుపాలు చేయాలని చూశారు..కానీ ప్రజాక్షేత్రంలో వైఎస్ నిలిచి గెలిచారు. ఇప్పుడు కూడా అదే అభూతకల్పనలు ప్రసారం చేయించి గెలవడానికి ప్లాన్ గీసినట్లు వార్తలొస్తున్నాయి..
తాజాగా తెలుగులోని న్యూస్ చానెళ్లకు టీడీపీ పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చానెళ్లు పలుసార్లు అర్ధగంట నుంచి గంట వరకు టీడీపీ ప్రచారాన్ని చేయాలని.. అదీ ఈసీ కంట పడకుండా.. ప్రకటనల రూపంలో కనిపించకుండా చేసేలా రూపొందించాలని దిశానిర్ధేశం చేసినట్టు తెలిసింది. దీనికి గాను సదురు న్యూస్ చానెళ్లు టీడీపీ నుంచి భారీ మొత్తానికి ‘ప్యాకేజీ’ మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. ప్రతీ బులిటెన్ లో టీడీపీ అనుకూల వార్తలను ప్రసారం చేయాలని.. చానెళ్లు కూడా తాము కోరుకున్న కంటెంట్ ను టీడీపీకి వ్యతిరేకంగా కాకుండా జాగ్రత్తగా రూపొందించి జనాలపై వదలాలని నిర్ణయించారట.. టీడీపీపై సదాభిప్రాయం కలిగేలా న్యూస్ ను రూపొందించాలని చర్చలు జరిపినట్టు సమాచారం.
వచ్చే లోక్ సభ ఎన్నికల వరకూ తెలుగులోని టాప్ 20 టీవీ చానెళ్లు టీడీపీ అనుకూల కంటెంట్ ను పెద్ద ఎత్తున ప్రసారం చేసేలా ఈ ఒప్పందం జరిగిందని మీడియా సంస్థ ల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ప్రచార అంశాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రకటనల రూపంలో ఉండవట.. సాధారణ న్యూస్ రూపంలోనే పక్కాగా రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట.. టీడీపీ సంక్షేమ పథకాలపై జనాల స్పందనలు తెలియజేసేలా ప్రోగ్రాంలను జాగ్రత్తగా రూపొందిస్తున్నారట.. న్యూస్ బులిటెన్లలో కూడా వీటిని ఎక్కడా దొరక్కకుండా జనాలకు చేరువయ్యేలా తీస్తున్నారట.... ఈ వార్తలు పెయిడ్ ఆర్టికల్స్ లా ఉండకుండా జాగ్రత్తగా తయారు చేస్తున్నారట... కాబట్టి వీటిపై ఎవరూ అభ్యంతరం చెప్పరని.. ఈసీకి ఫిర్యాదు చేయరని టీడీపీ మాస్టర్ స్కెచ్ వేసిందట..
చెల్లింపు వార్తలు, చెల్లింపు కథనాలుగా ఎవ్వరూ గుర్తుపట్టకుండా.. ఈసీకి దొరక్కుండా టీడీపీ అనుకూల కథనాలను రూపొందించేందుకు టీడీపీ ఏకంగా సీనియర్లతో పాత్రికేయ బృందాన్నే ఏర్పాటు చేసినట్టు సమాచారం. దీనికి భారీగా నిధులను కూడా లోకేష్ బాబు స్వయంగా సమకూర్చారని.. వారికి భారీగా జీతాలిచ్చి టీడీపీ అనుకూల కథనాలు తయారు చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో సాక్షి మినహా మిగతా అన్ని న్యూస్ చానెల్స్ ను టీడీపీ టీం సంప్రదించినట్టు మీడియా మిత్రులు కథలు కథలుగా చెబుతున్నారు..
ఈ సమాచారం సదురు జర్నలిస్టుల నుంచి ఆ నోటా ఈనోటా లీక్ అయ్యి ఇప్పుడు టీడీపీ మీడియా మేనేజ్ మెంట్ వ్యూహాలు బయటకొస్తున్నాయి. జనాలను, ఎన్నికలను ప్రభావితం చేసేలా ప్రీప్లాన్ డ్ గా ముందుకెళ్తున్న టీడీపీ టీంపై ఈసీ దృష్టిసారించాలని.. టీడీపీ అనుకూల కథనాలు, వార్తలపై కన్నేయాలని ఇతర రాజకీయ పక్షాలు కోరుతున్నాయి..దీనిపై ఫిర్యాదు చేసేందుకు కూడా వైసీపీ నేతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం.