Begin typing your search above and press return to search.

మండ‌లిలో తెలుగుదేశానికి ఝ‌ల‌క్..స‌భ్యులు ఆబ్సెంట్!

By:  Tupaki Desk   |   21 Jan 2020 5:51 AM GMT
మండ‌లిలో తెలుగుదేశానికి ఝ‌ల‌క్..స‌భ్యులు ఆబ్సెంట్!
X
ఏపీ మండ‌లిలో వికేంద్రీక‌ర‌ణ బిల్లును అడ్డుకుని స‌త్తా చూపించాల‌ని తెలుగుదేశం పార్టీ ఆరాట‌ప‌డుతూ ఉంది. అయితే అయితే మండ‌లిలో ఈ బిల్లును అడ్డుకున్నా అది తాత్కాలిక‌మే అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. మండ‌లిలో ఈ బిల్లు ఇప్పుడు ఆగిపోయినా, దాన్ని మ‌రోసారి శాస‌న‌స‌భ ఆమోదించి పంపితే.. మూడు నెల‌ల్లో మండ‌లిలో ఆమోదం పొందినా, పొంద‌క‌పోయినా ఆ బిల్లు కార్య‌రూపం దాలుస్తుంది. కాబ‌ట్టి మండ‌లి అధికారాలు ప‌రిమిత‌మే అని స్ప‌ష్టం అవుతూ ఉంది.

అయినా తాత్కాలికంగా ఈ బిల్లును ఆపి తెలుగుదేశం పార్టీ సంతోషం పొంద‌వ‌చ్చు. మండ‌లిలో తెలుగుదేశం పార్టీకి గ‌ట్టిగా మెజారిటీ ఉన్న నేప‌థ్యంలో బిల్లు ఆమోదం పొంద‌కుండా చూడ‌టం క‌ష్టం ఏమీ కాదు.

అయితే తెలుగుదేశం పార్టీకి ఈ విష‌యంలో కొన్ని అనుమానాలున్నాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశానికి ప‌దిమంది టీడీపీఎమ్మెల్సీలు గైర్హాజ‌రు అయ్యారు. దీంతో అనుమానాలు రేగుతూ ఉన్నాయి. ఇక మండ‌లికి మంగ‌ళ‌వారం ప‌లువురు టీడీపీ స‌భ్యులు గైర్హాజ‌రు అయిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి. వారిలో శ‌మంత‌క‌మ‌ణి - డొక్కా మాణిక్య వ‌రప్ర‌సాద్ - నామినేటెడ్ ఎమ్మెల్సీ ర‌త్న‌భాయి త‌దిత‌రులు ఉన్నార‌ట‌. అలాగే బీజేపీ శాస‌న‌మండ‌లి స‌భ్యులు మాధ‌వ్ కూడా గైర్హాజ‌రు అయిన‌ట్టుగా తెలుస్తోంది.

త‌మ పార్టీ ఎమ్మెల్సీల‌కు మంత్రి బొత్స ఫోన్లు చేశార‌ని మాజీ మంత్రి - టీడీపీ నేత య‌న‌మ‌ల ఆరోపించారు. ద‌మ్ముంటే ఆ ఆరోప‌ణ‌ను నిరూపించాల‌ని బొత్స ప్ర‌తి స‌వాల్ విసిరారు.