Begin typing your search above and press return to search.
జోరుగా ప్రారంభమైన టీడీపీ సభ్యత్వ నమోదు.. భారీ లబ్ధి!!
By: Tupaki Desk | 21 April 2022 8:29 AM GMTతెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఆ పార్టీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యం ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా ప్రారంభించారు. సభ్యత్వ నమోదుపై రూపొందించిన ఓ ప్రత్యేక వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.
ఉండవల్లి గ్రామ పార్టీ నేతల ద్వారా చంద్రబాబు సభ్యత్వం నమోదు చేసుకున్నారు. స్వయంగా రూ.100 చెల్లించిన చంద్రబాబు పార్టీ సభ్యత్వ పత్రాన్ని నాయకుల నుంచి స్వీకరించారు.
ఈ దఫా డిజిటల్ మాధ్యమంలోనూ టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. వా ట్స్ యాప్, టెలిగ్రామ్, మన టీడీపీ యాప్ ద్వారా సభ్యత్వం పొందే అవకాశం పార్టీ కార్యకర్తలు, అభిమా నులకు కల్పించారు.
తొలుత రూ.100తో సభ్యత్వం తీసుకున్న చంద్రబాబు పార్టీకి ఆన్లైన్లో లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. వేదికపైనే అచ్చెన్నాయుడు, నారా లోకేశ్లు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. చంద్రబాబుతో పాటు రాష్ట వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేపట్టారు.
100 రూపాయలు చెల్లింపు ద్వారా పార్టీ సభ్యత్వం పొందే అవకాశమిచ్చారు. సభ్యత్వం కార్డు పొందిన వారికి రూ. 2 లక్షల బీమా సౌకర్యాన్ని తెలుగుదేశం కల్పించింది. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో ఏపార్టీ చేయలేనంత సాంకేతికతతో సభ్యత్వ నమోదును చేస్తున్నట్లు అచ్చెన్నాయుడు చెప్పారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదులో చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ గ్రామానికీ తిరిగి సభ్యత్వాన్ని నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకా దు.. రాజకీయాల్లో తటస్థులుగా ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానించాలని నిర్ణయించారు. అదేసమయంలో పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కూడా చంద్రబాబు పిలుపునిచ్చారు.