Begin typing your search above and press return to search.
టీడీపీ మాట: గతం బాలేనందుకే అలా చేశాం
By: Tupaki Desk | 12 Feb 2017 6:35 AM GMTవైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు విషయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు ఆశ్చర్య, విస్మయ వాదనలు చేశారు. కేబినెట్ మంత్రి అయిన పీతల సుజాత అయితే రోజా ఏపీకి శని అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడటం ఆశ్చర్యకరం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీరు సరిగా లేదని మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా రాష్ట్రానికి శనిలా దాపురించిందని మంత్రి పీతల సుజాత ఆక్షేపించారు. రోజా రాజకీయాల్లోకి వచ్చాక కూడా నటన మానుకోలేదని మంత్రి విమర్శించారు. మహిళా పార్లమెంట్ సదస్సు విజయం కావడంపై ప్రతిపక్షాలకు భయం పట్టుకుందని పీతల సుజాత మండిపడ్డారు. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి ముళ్లపూడి రేణుకతో శాసనసభ్యురాలు అనిత రోజా ట్రాక్ రికార్డు (గత చరిత్ర) ఏమిటో అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. శాసనసభ నుంచి ఏడాదిపాటు బహిష్కరణకు గురికావటానికి దారితీసిన కారణాలేమిటో బాహ్య ప్రపంచానికి తెలియంది కాదు కదా అన్నారు. చారిత్రాత్మకమైన జాతీయ మహిళా పార్లమెంట్‌లో తాను ఎలాంటి రభస సృష్టించబోనంటూ ముందుగా అండర్‌టేకింగ్ (హామీ) ఇవ్వకపోవటం వల్లనే ముందు జాగ్రత్తగా సదస్సుకు అనుమతించలేదని స్పష్టం చేశారు.
రాజకీయాల కతీతంగా అన్ని పక్షాలవారికి ఆహ్వానాలు వెళ్లాయని అయితే రోజా మాత్రం సదస్సును అడ్డుకుంటానంటూ ముందుగానే అవాకులు, చెవాకులు పేలడం వల్ల, ఇంటిలిజెన్ వర్గాల ముందస్తు హెచ్చరికతో రోజాను అనుమతించలేదని ఎమ్మెల్యే అనిత చెప్పారు. వైకాపా తరపున ఎంపి బుట్టా రేణుక తొలిరోజు హాజరై ఎంతో హుందాగా ప్రసంగించగా, సీఎం చంద్రబాబు ఆమెను సత్కరించారంటూ గుర్తుచేశారు. ఇక రోజా పట్ల ప్రత్యేకంగా ఎందుకు వివక్ష ఉంటుందని ప్రశ్నించారు. దేశ, విదేశాల నుంచి దాదాపు 20వేల మంది ప్రతినిధులు తరలివచ్చిన ఈ సదస్సును భగ్నం చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెడ్డపేరు తీసుకురావాలనే తలంపుతో ఉన్న రోజా పట్ల ఆ పార్టీ నేత జగన్ ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారో అర్ధం కావడం లేదన్నారు. తక్షణం ఆమె చర్యలను ఖండించి క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆయనే స్వయంగా మాయలేడిగా పంపించే ప్రయత్నం చేసారా అనే అనుమానాలు వస్తాయని అనిత వ్యాఖ్యానించారు. జగన్‌కు మొదటి నుంచి ఏపీ అభివృద్ధి చెందటం ఇష్టం లేదని, అలాగే బాబుకు మంచిపేరు రావటం ఇష్టం లేదంటూ రేణుక, అనిత మండిపడ్డారు. ఆమె సదస్సులో ఏదో మాట్లాడుతుందని తామెవరం భయపడటం లేదంటూ అసలు ఆమె తన ఇష్టానుసారం మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని కూర్చుంటామా అని అనిత ప్రశ్నించారు.
కాగా, ఇలాంటి సదస్సులో రోజాకు మాట్లాడే అవకాశం కల్పించకపోయినా కనీసం ఓ ప్రతినిధిగా కూర్చోటానికి అనమతించాలి కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించగా ఎమ్మెల్యే అనిత సహా అధికార ప్రతినిధి రేణుక నోరు మెదపకుండా అక్కడ నుంచి లేచి వెళ్లడం గమనార్హం.