Begin typing your search above and press return to search.
బాబు ముందుచూపు మంత్రులకు నచ్చేసింది
By: Tupaki Desk | 21 Aug 2016 8:29 AM GMTమిత్రపక్షాలే అయినప్పటికీ ఏపీలో ఇప్పటికే టామ్ ఆండ్ జెర్రీ స్థాయి పోరును దాటేసిన టీడీపీ-బీజేపీల బంధంలో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఏపీకీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తున్నట్లు విస్పష్ట ప్రకటన చేసినప్పటి నుంచి ప్రతి పరిణామాన్ని క్షుణ్ణంగా గమనిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తాజాగా కొత్త విశ్లేషణ చేశారు. క్యాబినెట్ సమావేశంలో నిధుల వినియోగంపై చర్చ వచ్చిన సమయంలో కేంద్రం తీరును చంద్రబాబు తప్పు పట్టినట్లు సమాచారం. ప్రత్యేక హోదా అడుగుతుంటే నిధులిచ్చి సరిపెట్టుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని బాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
ఇటీవల విడుదల చేసిన నిధులు ఎందుకు ఉద్దేశించినవో కేంద్రం స్పష్టం చేయాల్సి ఉందని బాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డట్లు సమాచారం. గతంలో ప్రకటించిన విధంగా వెనుకబడి జిల్లాలకు - అమరావతికి కొంత ఇచ్చారని, మిగిలింది లోటు బడ్జెట్ ను పూడ్చుకునేందుకు ఇస్తే గనుక ఈ నిధులు ఏ మాత్రమూ సరిపోదని పేర్కొన్నారు. నిధులు ఇచ్చిన కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తుందా? లేదా అనేది స్పష్టం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధికి తోడ్పడటంలో భాగంగా కచ్చితంగా కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉందని చెప్పిన బాబు ఇచ్చిన మాట నిలుపుకొనేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ పరిస్థితులను చూస్తే హామీని పక్కనబెట్టే విధంగా ఈ వ్యవహారం ఉందని అన్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఇచ్చిన నిధులు కూడా సాధారణంగా ఇవ్వాల్సినవేనని, వాటిని ఇస్తూ రాష్ట్రాన్ని ఆదుకున్నట్లు ప్రచారం చేసుకుంటోందని, ఇది సరైన పద్ధతి కాదని మంత్రులతో చంద్రబాబు అభిప్రాయపడ్డట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ప్రత్యేక హోదా ఇస్తారో లేదో చెబితే దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని అన్నట్లు తెలిసింది. కేంద్ర వైఖరిపైనా - బీజేపీ నాయకుల వ్యాఖ్యలపైనా ఒకరిద్దరు మంత్రులు ప్రస్తావించగా తన దృష్టికి వచ్చిందని - తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఈ వ్యవహారంపై వాడీవేడిగానే చర్చ జరిగినట్లు తెలిసింది. అలాగే యూసీ పత్రాలు ఇవ్వడం లేదని ప్రచారం చేయడం వల్ల నిధులు దుబారా చేస్తున్నామనే అభిప్రాయాన్ని కేంద్రం ప్రజల్లోకి తీసుకెళుతోందని - దీనిపైనా జాగ్రత్తగా వ్యవహరించడంతోపాటు, వెంటనే యూసీలు సమర్పించాలని చంద్రబాబు ఆదేశించినట్లు తెలిసింది.
పుష్కరాల విషయంలో అనుకున్న విధంగా ప్రజలు రాలేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు నేరుగా జిల్లాల వారీగా రివ్యూలు ఏర్పాటు చేసుకుని అక్కడ నాయకత్వాన్ని ప్రోత్సహించి చివరి రోజుల్లో అయినా పుష్కరాలకు వచ్చే విధంగా చూడాలని బాబు ఆదేశించారు. ప్రభుత్వ పనితీరుకు పుష్కరాలు గీటురాయిగా ఉంటాయని, వాటిని ప్రజలకు చూపించడం ద్వారా పరిపాలనా తీరు నేరుగా ప్రజల్లోకి వెళుతుందని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో మంత్రులందరూ వారి జిల్లాకు వెళ్లి కార్యకర్తలను - నాయకులను కదిలించాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది.