Begin typing your search above and press return to search.
కేసీయార్, జగన్ పై చింతమనేని ఫైర్
By: Tupaki Desk | 7 July 2022 11:30 AM GMTతెలుగుదేశం పార్టీ మాజీ ఎంఎల్ఏ చింతమనేని ప్రభాకర్ ఫుల్లుగా ఫైరయ్యారు. పటాన్ చెరువు శివార్లలోని చినకంజర్ల తోటల్లో కోడిపందాలు నిర్వహించే చోటు నుండి చింతమనేని పరారైనట్లు డీఎస్పీ చెప్పారు. చినకంజర్ల తోటల్లో కోళ్ళపందేలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం ప్రకారం తాము దాడులు చేసినట్లు చెప్పారు. ఆ సమయంలో అక్కడ 70 మంది ఉన్నారని తమ దాడుల విషయం తెలియగానే చాలామంది పారిపోయినట్లు చెప్పారు.
అలా పారిపోయిన వారిలో మాజీ ఎంఎల్ఏ చింతమనేని కూడా ఉన్నట్లు ప్రకటించారు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇదే విషయమై చింతమనేని ఫేస్ బుక్ పోస్టులో స్పందించారు.
చినకంజర్లలో కోళ్ళ పందేలకు తనకు అసలు సంబంధమే లేదన్నారు. తాను లేకపోయినా ఉన్నట్లు, పారిపోయినట్లు ప్రకటించాల్సిన అవసరం పోలీసులకు ఏమొచ్చిందని ఫైర్ అయిపోయారు. కోళ్ళ పందేల దగ్గర లేని వ్యక్తిని ఉన్నట్లు చూపటం ఏమి రాజకీయమంటు నిలదీశారు.
రాజకీయాన్ని రాజకీయంతోనే ఎదుర్కోవాలి కానీ రాక్షస రాజకీయం ఏమిటంటు మండిపడ్డారు. నీచమైన ప్రచారంతోనే కుప్పకూలే పేకమేడలు కట్టి అధికారంలోకి వచ్చారంటు కేసీయార్, జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఇక్కడే రెండు మూడు అనుమానాలు వస్తున్నాయి.
మొదటిది చింతమనేని నిజంగానే అక్కడ లేకపోతే మాజీ ఎంఎల్ఏ పారిపోయాడని పోలీసులు ఎందుకు చెప్పారు ? చింతమనేని అక్కడ ఉన్నారా లేరా అన్నది పక్కనపెడితే ఈ వ్యవహారంలో కేసీయార్, జగన్ పాత్రముంది ? చింతమనేని వాళ్ళిద్దరినీ ఎందుకు టార్గెట్ చేసినట్లు ?
తాను నిజంగానే కోళ్ళపందేలు జరిగే చోట లేకపోతే ఆ విషయాన్ని నిరూపించుకోవాల్సిందిపోయి కేసీయార్, జగన్ను టార్గెట్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగముండదని తెలీదా ? తాను అక్కడ లేనని చెప్పుకునేందుకు ఫేస్ బుక్ లోనే ఎందుకు స్పందించారు. నేరుగా పోలీసుల దగ్గరకే వెళ్ళి తేల్చుకోవచ్చు కదా. మధ్యలో ఏ సంబంధంలేని వీళ్ళిద్దరిని శాపనార్ధాలు పెడితే ఉపయోముండదని చింతమనేనికి తెలీదా ?