Begin typing your search above and press return to search.
బాబు దిష్టిబొమ్మ దగ్ధం..ఎమ్మెల్యేపై వారెంట్
By: Tupaki Desk | 24 Jan 2018 4:30 AM GMTఔను, టీడీపీ ఎమ్మెల్యేకు...ఆ పార్టీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మ దగ్ధం చేసినందుకు వారెంట్ వచ్చింది.టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి...బాబు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం ఎందుకు? ఆయనకు వారెంట్ ఏంటని ఆశ్చర్యపోకండి. ఆ ఎమ్మెల్యే పాతపట్నం శాసనసభ్యుడు కలమట వెంకటరమణ. వైసీపీ తరఫున గెలిచిన వెంకట రమణ ఆ పార్టీలో ఉన్న సమయంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలోఈ చర్యకు పాల్పడ్డారు.
అనంతరం ఆయన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే కేసు మాత్రం అలాగే ఉండిపోయింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న సమయంలో నమోదైన ఈ కేసు విచారణకు టీడీపీ ఎమ్మెల్యే హాజరుకాలేదు. పలు దఫాలుగా నోటీసులు జారీ అయినప్పటికీ ఎమ్మెల్యే గైర్హాజరు అవడంతో..న్యాయమూర్తి తాజాగా వారెంట్ జారీ చేశారు.
ఇదిలాఉండగా...స్థానికంగా వెంకటరమణకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయంటున్నారు. గత ఎన్నికల్లో వెంకట రమణ చేతిలో ఓడిపోయిన శత్రుచర్ల విజయరామరాజు అనుచరుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. శత్రుచర్లను శాంతింపజేయడానికి చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చినప్పటికీ వ్యవహారం సద్దుమణగలేదని సమాచారం.