Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్యే వీరంగం చూశారా?
By: Tupaki Desk | 30 Aug 2017 8:42 AM GMTఏపీలో అధికార పార్టీ టీడీపీ నేతల అరాచకాలు శృతి మీరుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థను నవ్వులపాలు చేసేలా.. అధికార గర్వంతో ఆ పార్టీ నేతలు వ్యవహరించిన ఘటనలు చాలా ఉన్నాయి. అధికారం అండతో ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూచున్నా పర్లేదన్న చందాన.. తాము ఏంచేసినా అడిగేవాడెవడనే అహంకార వైఖరితో విర్రవీగుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజాగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) - ఆయన సోదరుడు సత్యనారాయణ హద్దుమీరి ప్రవర్తించారట. వైసీపీ అభ్యర్థులను బెదిరిండంతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారట. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి.. ఏకంగా ఎన్నికల కేంద్రాల దగ్గరే ప్రచారం చేశారన్న ఆరోపణ ఇప్పుడు పెద్ద చర్చకే తెర తీసింది. అంతేనా.. బాధ్యత కలిగిన శాసనసభ్యుడిననే విషయం మరచి.."సాయంత్రం నాలుగు గంటలకల్లా నీ అంతు చూస్తా" అంటూ వై సీపీ అభ్యర్థి అంకడి సత్తిబాబును ఎమ్మెల్యే కొండబాబు బెదిరించారట.
ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ కుమారులు ఉమాశంకర్ 14వ డివిజన్ - ప్రసాద్ 23వ డివిజన్ నుంచి పోటీ చేశారు. 14వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా అంకడి సత్తిబాబు బరిలోకి దిగారు. ఎక్కడ తన కుమారుడు ఓడిపోతాడోనన్న భయంతో ఎమ్మెల్యే సోదరుడు వనమాడి సత్యనారాయణ మంగళవారం 14వ డివిజన్ పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లను ప్రలోభపెట్టారు. తన కుమారుడికి ఓటు వేయాలని కోరారు. పోలింగ్ కేంద్రం వద్దే తిష్టవేసిన టీడీపీ నేతలను ఎందుకు అడ్డుకోవడం లేదని సత్తిబాబు పోలీసులను ప్రశ్నించారు.
దీంతో వనమాడి సత్యనారాయణ వైసీపీ అభ్యర్థి సత్తిబాబుపై బూతు పురాణం అందుకున్నారు. ఇంతలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కొండబాబు.. సత్తిబాబు వైపు వేలు చూపిస్తూ ‘సాయంత్రం నాలుగు గంటల్లోపు నీ అంతు చూస్తా’ అని బెదిరించారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కొండబాబు కాకినాడలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. అంతేకాకుండా తన అనుచరులతో పలు డివిజన్లలో భారీగా దొంగ ఓట్లు వేయించారు.