Begin typing your search above and press return to search.

టీడీపీ విప్ 'కూన‌' వేషాలు చూశారా?

By:  Tupaki Desk   |   17 March 2017 7:51 AM GMT
టీడీపీ విప్ కూన‌ వేషాలు చూశారా?
X
ఏపీలో ఏ త‌ర‌హా పాల‌న సాగుతోందో ఈ ఘ‌ట‌న క‌ళ్ల‌కు క‌డుతోంది. ఓ వైపు రాష్ట్రంలో క‌రువు లేనే లేద‌ని చెబుతున్న చంద్ర‌బాబు స‌ర్కారు... ఆ వెనువెంట‌నే క‌రువు మండ‌లాల‌ను ప్ర‌క‌టించ‌డం, ఆ వెనువెంట‌నే మ‌ళ్లీ పాత పాట‌ను అందుకుని రాష్ట్రంలో క‌రువు ఎక్క‌డుందో చెప్పండంటూ విప‌క్షాలు - మీడియాపై చిందులేయ‌డం ఈ మధ్య ప‌రిపాటిగా మారింది. మొన్న‌టికి మొన్న అనంత‌పురం - చిత్తూరు - క‌ర్నూలు జిల్లాల్లో సాగు చేసిన వేరుశ‌న‌గ నీటి త‌డుల్లేక ఎండ‌బార‌డం మొద‌లైన స‌మ‌యంలో రైతుల ఆగ్ర‌హ‌వేశాల‌తో అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దిగిన బాబు అండ్ కో... రెయిన్ గ‌న్ల‌ను దించిన‌ట్లు ప్ర‌క‌టించింది. తాము చేప‌ట్టిన త‌క్ష‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ల‌క్ష‌లాది ఎక‌రాల్లో పంట‌ను కాపాడామ‌ని కూడా జ‌బ్బ‌లు చ‌రుచుకుంది.

అయితే బాబు స‌ర్కారు ఎంత చేసినా... ఎండిపోతున్న పంట‌లైతే ఎండిపోయాయి. అక్క‌డక్క‌డ కొంత మేర పంట చేతికొచ్చినా... రైత‌న్న‌కు ద‌క్కిన లాభం మాత్రం శూన్య‌మేన‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో 2016 ఖ‌రీఫ్‌ కు సంబంధించి రాష్ట్రంలో తొలి విడ‌త‌గా 268 మండ‌లాల‌ను క‌రువు మండ‌లాలుగా ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం... ఆ మండ‌లాల్లో వ‌ర్షాభావం కార‌ణంగా పంట‌లు దెబ్బ‌తిన్నాయ‌ని చెప్పుకొచ్చింది. ఇదే విష‌యాన్ని సాగు శాఖ మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు అసెంబ్లీ సాక్షిగానూ ఇదే విష‌యాన్ని చెప్పారు. తాజాగా వారం క్రితం మ‌రో 33 మండ‌లాల్లోనూ క‌రువు ఉంద‌ని, వెర‌సి మొత్తం క‌రువు మండ‌లాల సంఖ్య 301గా తేల్చేసింది. ఈ విష‌యాన్ని కూడా ప్ర‌భుత్వం అసెంబ్లీ సాక్షిగానే ప్ర‌క‌టించింది.

అయితే ప్ర‌భుత్వ విప్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కూన ర‌వికుమార్... గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్యవాదాలు తెలిపే క్ర‌మంలో చేసిన సుదీర్ఘ ప్ర‌సంగంలో అస‌లు రాష్ట్రంలో క‌రువు లేనే లేద‌ని చెప్పేశారు. దేశం మొత్తం మీద న‌మోదైన స్థూల జాతీయోత్ప‌త్తి, సాగు రంగంలో న‌మోదైన వృద్ధి విష‌యాల్లో రాష్ట్రం దేశ స‌గ‌టుకు రెట్టింపు వృద్ధి సాధించింద‌ని ప్ర‌క‌టించారు. క‌రువు మండ‌లాలున్నాయ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన వేదిక‌పైనే... అంటే అసెంబ్లీ సాక్షిగానే అది కూడా ప్ర‌భుత్వ విప్‌గా ఉన్న కూన ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/