Begin typing your search above and press return to search.
అరెస్ట్ పై అలా మాట్లాడితే ఎలా మాగంటి?
By: Tupaki Desk | 11 Feb 2016 6:10 PM GMTతెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేయకున్నా.. రేవంత్ లాంటి ఒకరిద్దరు నేతల్ని వదిలేసి.. మిగిలిన తమ్ముళ్లను కారు ఎక్కించుకోవాలని చూస్తున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా మరో మైండ్ గేమ్ షురూ చేశారా? అన్నది ప్రశ్నగా మారింది. టీటీడీపీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్)ను కారు ఎక్కించేందుకు వీలుగా దండోపాయానికి తెర తీశారన్న ఆరోపణ వినిపిస్తోంది.
కొద్దినెలలుగా పెద్దగా వినిపించని ఓటుకు నోటు కేసు వ్యవహారం ఇప్పుడు ఉన్నట్లుండి తెర మీదకు రావటంతో పాటు.. ఈ ఉదంతంలో సంబంధం ఉందంటూ మాగంటి మీద ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఓటుకు నోటు కేసులో మాగంటి పాత్రను తెలియజేసే ఆధారాలు పక్కాగా దొరికిపోయాయని.. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం మీడియాలో సాగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో మాగంటి రియాక్ట్ అయ్యారు. ఓటుకునోటు కేసులో తన పాత్ర ఉందన్న ఆధారాలు ఉంటే.. ఈ కేసులో రేవంత్ ను అరెస్ట్ చేసినప్పుడే ఎందుకు విచారించలేదని ప్రశ్నిస్తున్నారు.
తనపై పార్టీ మారాలంటూ ఒత్తిడి పెడుతున్నారని.. తాను కుదరదని చెప్పటంతో తనపై ఇలాంటి ప్రచారం మొదలు పెట్టారంటూ మాగంటి మండిపడుతున్నారు. తాను కానీ తప్పు చేసి ఉంటే.. ఇప్పటికే చర్యలు తీసుకునే వారంటూ వ్యాఖ్యానించారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని.. తనను ఒత్తిడికి నెట్టే ప్రయత్నం నెరవేరదని వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ.. తప్పు చేస్తే ఎప్పుడో అరెస్ట్ చేసేవారని చెబుతున్న మాగంటి మాటలతో.. మరి.. రేవంత్ రెడ్డి.. సండ్ర సంగతేమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్త వెనుకా ముందు చూసుకొని మాట్లాడితే మాగుంటికే కాదు.. పార్టీకి బాగుంటుంది సుమా.