Begin typing your search above and press return to search.
జగన్ ప్రమాణానికి బాబు ఎందుకు వెళ్లడం లేదంటే..
By: Tupaki Desk | 29 May 2019 5:44 PM GMTతన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ జగన్ స్వయంగా ఆహ్వానించినా టీడీపీ నేత చంద్రబాబు హాజరుకాకపోతుండడంపై ఏపీలో చర్చ జరుగుతోంది. అయితే.. టీడీపీ నేతలు మాత్రం అందుకు కారణాలు చెబుతున్నారు. చంద్రబాబు వెళ్లాలనే అనుకున్నారని.. కానీ, ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఆయన్ను వద్దని చెప్పడంతో ఆలోచన మార్చుకున్నారని అంటున్నారు. ఈ రోజు జరిగిన టీడీపీ శాసనసభా పక్ష సమావేశంలో జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై చర్చ జరిగినప్పుడు చంద్రబాబు వెళ్లేందుకు సానుకూలంగా కనిపించారని.. కానీ, మెజారిటీ సభ్యులు చెప్పిన లాజిక్ విని ఆయన కూడా నిర్ణయం మార్చుకున్నారని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్ ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ లో కాకుండా బయట జరుగుతోందని.. దీంతో అది ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా పార్టీ కార్యక్రమంలా జరుగుతోంది కాబట్టి మీరు వెళ్లడం కరెక్టు కాదని ఎమ్మెల్యేలు చెప్పడంతో చంద్రబాబు కూడా ఆలోచించారని.. సీనియర్ నేతల బృందాన్ని పంపించి - వారితో తాను రాసిన అభినందన లేఖ కూడా పంపాలని నిర్ణయించారని పయ్యావుల చెప్పారు.
కాగా జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లే బృందంలో టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల - అచ్చెన్నాయుడు - చక్రపాణి ఉంటారు. కాగా తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబును కాబోయే సీఎం జగన్ ఆహ్వానించారు. ఆయన మంగళవారం చంద్రబాబుకు ఫోన్ చేశారు. అయితే, ఆ సమయంలో చంద్రబాబు పార్టీ కార్యక్రమంలో ఉండడంతో జగన్ తో మాట్లాడేందుకు వీలు కాలేదు. ఇదే విషయాన్ని చంద్రబాబు కార్యాలయ సిబ్బంది జగన్‌కు వివరించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించేందుకు ఫోన్ చేశానని... ఈ సమాచారాన్ని చంద్రబాబుకు చేరవేయాలని జగన్ చెప్పారు. అయితే... జగన్ ప్రమాణ స్వీకారానికి వెళ్లడంపై బుధవారం జరిగే టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఇలా పార్టీ బృందాన్ని పంపాలని నిర్ణయించారు.