Begin typing your search above and press return to search.
బాబు డీల్..రాహుల్ తో బస్సులో టీడీపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 14 Aug 2018 2:49 PM GMTకాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి చేరువ అవుతోందా? రాబోయే ఎన్నికల్లో జట్టుకట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుందా? ప‌్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ ఆ ఎత్తుగడలో భాగమేనా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏకంగా టీడీపీకి చెందిన డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఆ పార్టీలో కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు కాంగ్రెస్ అధ్యక్షుడితో చెట్టాపట్టాలు వేసుకొని ముందుకు సాగడం ఇందుకు నిదర్శనంగా చెప్తున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ టూర్ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆయనతో పాటుగా బస్సులో ప్రయాణించడం ఈ చర్చకు తెరలేపింది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మునుపటి ఉత్సాహంతో లేరు. ఆయన్ను ఓటుకునోటు కేసు తీవ్ర ఇరకాటంలో పడేసిందని అంటున్నారు. మరో ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమసంఘం పనుల్లో నిమగ్నమై పార్టీకి సమయం కేటాయించే పరిస్థితిలో లేరు. కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ ఆర్.కృష్ణయ్య గళం విప్పడంతో చంద్రబాబు ఇరకాటంలో పడేసిన సంగతి తెలిసిందే. అనంతరం హైదరాబాద్ లో చంద్రబాబు-ఆర్.కృష్ణయ్య మధ్య భేటీతో ఈ వివాదం సద్దుమణిగిందని భావించారు. కానీ ఆర్.కృష్ణయ్య తన దారి తాను చూసుకుంటున్నట్లు చెప్తున్నారు. రాహుల్ గాంధీ బసచేసిన హోటల్ లో ఆయనతో ఆర్.కృష్ణయ్య సమావేశమయ్యారు. అనంతరం రాహుల్ గాంధీ గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించేందుకు బయల్దేరుతుండగా ఆయనతో పాటు బస్సులో ఆర్.కృష్ణయ్య బయల్దేరారు.
రాహుల్ గాంధీతో పాటు ఆర్.కృష్ణయ్య వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ లో చేరుతున్నారని కొందరు పేర్కొంటున్నారు. టీడీపీకి తెలంగాణలో అడ్రస్ గల్లంతు అయిపోయిన నేపథ్యంలో ఆయన తనదారి తాను చూసుకుంటున్నారని వివరిస్తున్నారు. ఇదిలాఉండగా...టీడీపీ-కాంగ్రెస్ పొత్తులో భాగమే ఈ భేటీ అని మరికొందరు జోస్యం చెప్తున్నారు.