Begin typing your search above and press return to search.
పవన్ పై గట్టి ముద్ర వేస్తున్న టీడీపీ!
By: Tupaki Desk | 29 March 2019 8:16 AM GMTపవన్ కల్యాణ్ తమ వాడే అని ప్రచారం చేసుకుంటూ ఉంది తెలుగుదేశం పార్టీ! ఒకవైపు ఈ ఎన్నికల బరిలో పవన్ కల్యాణ్ తన పార్టీని దింపినా తెలుగుదేశం పార్టీ మాత్రం పవన్ కల్యాణ్ మీద తనదైన ప్రచారం చేసుకొంటూ ఉంది. ఈ వ్యవహారం వార్తల్లోకి కూడా వస్తోంది. ప్రత్యేకించి గోదావరి - ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొందరు తెలుగుదేశం నేతలు ఈ తరహాలో ప్రచారం చేసుకొంటూ ఉండటం ఆసక్తిదాయకంగా మారింది. పవన్ కల్యాణ్ తమ వాడే అని అక్కడి నేతలు ప్రచారం చేసుకొంటూ ఉన్నారు.
ఏవో కొన్ని విబేధాలతో చంద్రబాబుకు పవన్ కల్యాణ్ దూరం అయ్యారు తప్ప.. ఇరువురి మధ్యన సఖ్యత ఉందని తెలుగుదేశం వాళ్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి.. పవన్ గురించి ఎక్కువగా ఆరాటపడవద్దని.. తెలుగుదేశం పార్టీకే సహకరించాలని వీరు ప్రచారం చేసుకొంటూ ఉన్నారు.
విశాఖ జిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు మెట్ల రమణబాబు ఈ వ్యాఖ్యలు చేసిన దాఖలాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్..చంద్రబాబు నాయుడులు కలిసే ఉన్నారని - వారి మధ్యన ఎలాంటి విబేధాలు లేవన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. వారిద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించినట్టుగా సమాచారం. ఏవో చిన్న డిస్ట్రబెన్సెస్ ఉన్న మాట వాస్తమే కానీ - వారిద్దరూ కలిసే ఉన్నారని ఆయన అన్నారట. జనసేనకు పడే ఓట్లను అటు వైపు వెళ్లకుండా చేసేందుకే ఇలాంటి ప్రచారం జరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇక తాజాగా పిఠాపురం తెలుగుదేశం అభ్యర్థి వర్మ ఇదే ప్రచారాన్ని చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. ‘పవన్ కల్యాన్ మన సన్నిహితుడే ఆయనతో కలిసి పని చేద్దాం..’అంటూ వర్మ వ్యాఖ్యానించారు. ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇలా వ్యాఖ్యానించారంటే ఇది తీవ్రమైనదే అని చెప్పవచ్చు. మరి తెలుగుదేశం నేతలు ఇలా ప్రచారం చేసుకొంటూ ఉండటంపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో!