Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్యేలకు భార్యల జాగ్రత్తలు
By: Tupaki Desk | 10 Sep 2016 4:33 PM GMTఏపీకి ప్రత్యేక హోదా లేదని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా తేల్చిసిన నేపథ్యంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు అనేక ఆసక్తికర పరిణామాలకు వేదికయ్యాయి. ఏపీకి హోదా దక్కకపోవడంతో అధికార తెలుగుదేశం పార్టీ ఇరుకునపడగా...ప్రతిపక్షం వైసీపీ దూకుడుగా ముందుకుపోయింది. సభ సాగిన మూడురోజులు స్పీకర్ పోడియం వద్దకు వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకుపోయారు. అయితే ఈ పరిణామంపై టీడీపీ ఎమ్మెల్యేల సతీమణుల్లో ఆందోళన రేకెత్తించిందట. ఏకంగా జాగ్రత్తలు కూడా సూచించారట.
అసెంబ్లీ వాయిదపడిన సందర్భంలో పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఈ విషయాన్ని మీడియా మిత్రులతో పిచ్చాపాటిగా పంచుకున్నారు. సభలో వైసీపీ నేతల దూకుడు వైఖరిని టీవీల్లో చూస్తున్న తమ భార్యలు జాగ్రత్తగా ఉండాలని దాదాపుగా ప్రతిరోజు ఫోన్లు చేసి చెప్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాలు తమకు ప్రతిష్టాత్మకంగా మారాయి కాబట్టి ఇబ్బంది పడుతూ అయిన సభకు రావాల్సి వస్తోందని వర్మ వ్యాఖ్యానించారు. వైకాపా తీరు సభలో ఉన్న తమతో పాటు ఊర్లలో ఉన్న వారిని సైతం కలవరపర్చిందని వర్మ వాపోయారు. ఇది తన ఒక్కడి పరిస్థితి కాదని...దాదాపు అందరూ ఇదే అనుభవాన్ని ఎదుర్కున్నారని చెప్పారు. అయితే వర్మ వ్యాఖ్యలు ఇటు వైసీపీని టార్గెట్ చేసినట్లు ఉండటంతో పాటు అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను సైతం ఇరకాటంలో పడేసినట్లు ఉన్నాయని పలువురు చెప్తున్నారు.