Begin typing your search above and press return to search.

అవినీతి ఆరోప‌ణ‌లు... వైసీపీ వైపు టీడీపీ ఎమ్మెల్యే చూపు?

By:  Tupaki Desk   |   25 Dec 2019 8:03 AM GMT
అవినీతి ఆరోప‌ణ‌లు... వైసీపీ వైపు టీడీపీ ఎమ్మెల్యే చూపు?
X
ప‌్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ ఖాయ‌మ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ వైపు, రాష్ట్రంలో ప‌రిపాలిస్తున్న వైసీపీ వైపు ప‌చ్చ‌పార్టీ ఎమ్మెల్యేలు ఫోక‌స్ పెట్టార‌ని మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇప్ప‌టికే ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యే ఈ రెండు పార్టీల‌తో ట‌చ్‌లో ఉండ‌గా...మరి కొంద‌రు సైతం ఇదే బాట‌లో ఉన్నారంటున్నారు. అయితే, ఇలాంటి జాబితాలో ఉన్న
శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ పేరు వినిపిస్తోంది. ఇటు బీజేపీ, అటు వైసీపీ ఆయ‌న‌పై ఫోక‌స్ పెట్టిందంటున్నారు. అయితే, ఎమ్మెల్యే అశోక్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో...ఆయ‌న ఎటువైపు మొగ్గు చూపుతారు? టీడీపీలోనే కొన‌సాగుతారా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ శ్రీకాకుళం జిల్లా ముఖ్య‌నేత‌లైన దివంగ‌త కింజరాపు ఎర్ర‌న్నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టీంలో ఉన్నారు. అయితే, ఆయ‌న‌పై తిత్లీ ప‌రిహారం ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఎర్ర‌న్నాయుడు, ఆయ‌న‌ మనుషులు, ఎమ్మెల్యే అశోక్‌ బంధువులు తిత్లీ పరిహారాన్ని దోచేశారని, వారి అడుగు జాడల్లో ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా సర్వం స్వాహా చేశారని వైసీపీ నేత‌లు ఆరోపించారు. కుటుంబసభ్యుల పేరున ఎటువంటి భూములు లేనప్పటికీ నష్టపరిహారాన్ని లక్షల రూపాయల్లో అందుకున్నారనే ఆరోప‌ణ‌లు అప్పట్లోనే వెలుగు చూశాయని...అయితే వారి పార్టీ అధికారంలో ఉండటంతో విచారణ జోలికి పోలేదని పేర్కొంటున్నారు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు అందడంతో అక్రమాల డొంక కదిలింద‌ని చెప్తున్నారు.

ఇలా కొద్దికాలం కింద‌టి అక్ర‌మాల‌తో ఒత్తిడి చేస్తూ...ఎమ్మెల్యే అశోక్‌ను టార్గెట్ చేసిన‌ట్లు స‌మాచారం. త‌మ పార్టీలోకి వ‌స్తే..విచార‌ణ ఉండ‌ద‌నే ప్ర‌తిపాద‌న సైతం పెట్టిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై అశోక్ సైతం ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ సైతం అశోక్ బంధువుల ద్వారా త‌మ పార్టీలో చేరాల‌నే ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్లు తెలుస్తోంది. రెండు ముఖ్య‌మైన పార్టీల ఆఫ‌ర్ల‌తో అశోక్ డైలామాలో ప‌డ్డార‌ని స‌మాచారం. వైసీపీ అధికారంలో ఉండ‌టం, త‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో అశోక్ అంత‌ర్మ‌థ‌నంలో ఉన్నారంటున్నారు. అయితే, ఇంకా తుది నిర్ణ‌యం ఏదీ తీసుకోలేదంటున్నారు.