Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్యే ముతక మాటలు.. రాడ్లు..కర్రలు తీసుకొని రోడ్ల మీదకు వస్తారట
By: Tupaki Desk | 31 Jan 2020 4:55 AM GMTఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజల్లో వ్యతిరేకత పెంచటం లో విపలమవుతున్న బాబు బ్యాచ్ కు ఇరిటేషన్ అంతకంతకూ పెరిగి పోతోంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో దూసుకెళుతున్న జగన్ ప్రభుత్వాన్ని నిలువరించటానికి.. ప్రజల్లో ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేయటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా.. అవేమీ వర్క్ వుట్ కాని పరిస్థితి. అదే సమయంలో పాలనా పరమైన సౌలభ్యం కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు గ్లోబల్ ప్రచారం చేస్తున్న బాబు బ్యాచ్ మాటలకు ప్రజలు పడిపోకపోవటాన్ని వారు జీర్ణించుకోలేనట్లుగా కనిపిస్తోంది.
అసహనం హద్దులు దాటేస్తూ.. అధికార పక్షంపై తమకున్న అక్కసును తెలుగు తమ్ముళ్లు కొందరు తమ మాటలతో బయట పడుతున్నారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తూ. . వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. విశాఖ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. దారుణ వ్యాఖ్యలు చేశారు. విశాఖకు కడప కల్చర్ ను వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీసుకొచ్చారంటూ అవాకులు చవాకులు పేలారు.
దాడులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని.. విశాఖ మహానగరంలో రౌడీ రాజ్యం కొనసాగుతుందన్నఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తమ తీరు మార్చుకోకపోతే తాము కూడా రాడ్లు.. కర్రలు తీసుకొని రోడ్ల మీదకు వస్తారని వ్యాఖ్యానించారు. నిజంగానే.. అధికార పక్షానికి చెందిన నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి ఉంటే.. అందుకు తగిన ఆధారాలు చూపించాల్సింది పోయి రెచ్చగొట్టేలా మాట్లాడటంలో అర్థమేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. విశాఖను పూర్తిస్థాయి రాజధానిగా ప్రకటించాలని.. అందుకు జగన్ కు దమ్ముందా? అని ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముడి మాటలు వింటే.. ఓపక్క రాజధాని వద్దంటూనే మరోవైపు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం చూస్తే.. తెలుగు తమ్ముళ్ల రాజకీయం ఇట్టే అర్థం కాక మానదు.