Begin typing your search above and press return to search.
పొద్దున్న బీజేపీ..సాయంత్రం వైసీపీ..వంశీ ఏమిటి ఈ కన్ఫ్యూషన్ !
By: Tupaki Desk | 25 Oct 2019 12:03 PM GMTగన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని విడి వేరే పార్టీ లో జాయిన్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. గత కొద్దిరోజులుగా ఈయన పార్టీ మారతారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తాజాగా జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఏపీలో ఘోరంగా ఓడిపోయింది. ఆ తరువాత పలువురు కీలక నేతలు టీడీపీలో ఉంటే ..రాజకీయ భవిష్యత్ ఉండదు అని గ్రహించి ఇతర పార్టీలలోకి జంప్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఉదయం సుజనా తో భేటీ అయ్యారు. సుజనా తో వంశి భేటీ కావడం ఇది రెండోసారి కావడం విశేషం. గతంలో వీరిద్దరి భేటీ జరిగిన అది తన వ్యక్తిగతం అని వంశీ అప్పట్లో చెప్పుకొచ్చాడు. దీనితో అందరూ వంశీ బీజేపీ లో చేరతారు అంటూ అనుకున్నారు.
కానీ , సుజనా తో భేటీ ముగిసిన కాసేపటికే ..ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ కావడం అందరిని షాక్ కి గురిచేస్తుంది. అరగంటపాటు జగన్ తో వల్లభనేని మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వంశీని సీఎం వద్దకు మంత్రి పేర్ని నాని తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో వంశీ ఏ పార్టీలో చేరాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన ఏ పార్టీలోకి వెళ్తారనే సందిగ్ధం మూడు పార్టీల్లో నెలకొంది.