Begin typing your search above and press return to search.
విజయసాయి మాటతో బాబు గుండెల్లో రైళ్లు
By: Tupaki Desk | 16 April 2018 8:20 AM GMTగడిచిన కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై టీడీపీ శ్రేణులు ప్రత్యేకంగా ఫోకస్ చేయటం తెలిసిందే. ఏదో రీతిలో విజయసాయిని ఇరుకున పెట్టేలా తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కన్ఫ్యూజ్ పడేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నుంచి తమ పార్టీలోకి వచ్చేందుకు చాలామంది ఎమ్మెల్యేలు.. నేతలు ప్రయత్నిస్తున్నారని.. ఇప్పటికే చర్చలు కూడా సాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి రకరకాల ఒత్తిళ్లతో తన పార్టీలో వచ్చే ప్రయత్నం చేశారు.
రోజురోజుకీ పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతతో పాటు.. బాబు తీసుకుంటున్న నిర్ణయాలు.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బాబు యూటర్న్ లు ప్రజల్లో ఆయన్ను చులకన చేశాయి. దీంతో పాటు ప్రభుత్వ వ్యతిరేత.. అవినీతి నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న మాటలు వినిపిస్తున్నాయి.. ఈ నేపథ్యంలో బాబు గూటి నుంచి జగన్ గూటికి వచ్చేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి. అయితే.. టీడీపీ నుంచి వచ్చే వారి విషయంలో జగన్ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
2019లో అధికారంలోకి వచ్చేది తామేనని.. అనంతరం బాబు.. ఆయన తనయుడు లోకేశ్ చేసిన అవినీతి మీద చర్యలు తీసుకుంటామన్నారు. విజయసాయి చెప్పిన మాటలు టీడీపీ వర్గాల్లో కొత్త కలకలాన్ని రేపుతున్నాయి. మునిగే బోటులో ఎవరు మాత్రం ఉండేందుకు ఇష్టపడతారు. ఈ కారణంతోనే కావొచ్చు.. సైకిల్ దిగేసి ఫ్యాన్ కింద కూర్చునేందుకు తమ్ముళ్లు రెఢీ అంటున్నట్లుగా చెబుతున్నారు.