Begin typing your search above and press return to search.
టైం కోసం తమ్ముళ్లు వెయిట్ చేస్తున్నారట
By: Tupaki Desk | 5 April 2017 4:52 AM GMTఏపీ మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వెల్లువెత్తిన అసంతృప్తి జ్వాలలు ఆరిపోయినట్లు కనిపిస్తున్నా.. లోలోన మాత్రం రగులుతూనే ఉంది. నివురుగప్పిన నిప్పులా పలువురు నేతలు టైం కోసం ఎదురుచూస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతకంతా బదులు తీర్చుకుంటామంటున్న కొందరి నేతలు మాటలు విస్మయానికి గురి చేస్తున్నాయి. పార్టీలో ఉండి.. పార్టీ అధినేత పట్ల ఇంత ఆగ్రహం వ్యక్తం చేయటం చూస్తే.. బాబుకు ఫ్యూచర్లో ఇబ్బందులు తప్పవన్న మాటను పలువురు చెబుతున్నారు.
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు బాబు చుట్టు ఉన్నవారిలో చాలామంది లేరని.. అప్పట్లో ఆయన్ను దెబ్బ తీసేందుకు ప్రయత్నించిన వారే.. ఇప్పుడు ఆయన నెత్తికి ఎక్కించుకున్న వైనంపై రగిలిపోతున్నారు. కష్టకాలంలో వెంట నడిచిన వారిని పట్టించుకోని చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పుడు కాక.. మరెప్పుడు తమకు సాయం చేస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని అశక్తతతో ఉన్న వేళ.. తనకు అండగా నిలిచిన ప్రతిఒక్కరిని గుర్తుంచుకుంటానని.. పవర్ లోకి వచ్చినంతనే అందరి క్షేమం చూస్తానని మాట ఇచ్చిన ఆయన.. ఈ రోజు అందుకు భిన్నంగా వ్యవహరించటంపై తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు. పవర్లో లేనప్పుడుపార్టీ నుంచి జంప్ అయి.. నాటి అధికారపక్షంలో రాసుకుపూసుకు తిరిగిన వారికే బాబు విలువ ఇస్తున్నారని.. వారికే పదవులు కట్టబెడుతున్నారన్న వాదనను బాబుసన్నిహితులు కూడా కొట్టిపారేయకపోవటం గమనార్హం.
అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు వచ్చిన రాయబారుల్ని.. అసంతృప్తు తమ్ముళ్లు తమ మాటలతో ఉతికి ఆరేస్తున్నట్లుగా తెలుస్తోంది. నమ్మకస్తుల్ని కాకుండా ప్రయోజనాలు ఆశించి వస్తున్న వారికి పెద్దపీట వేస్తున్న బాబుకు.. రానున్న రోజుల్లో తమ విలువ తెలిసి వస్తుందని.. ఆరోజున ఆయన మాదిరే కఠినంగా వ్యవహరిస్తామన్న మాటన పలువురు నేతల నోటి వెంట రావటం గమనార్హం. పదవులు ఇవ్వకపోతేనే ఇంత వ్యతిరేకత రాదని.. గడిచిన కొంతకాలంగా బాబు తీసుకుంటున్న చాలా నిర్ణయాల విషయంలో తమ్ముళ్లు గుర్రుగా ఉన్న విషయం తాజా ఎపిసోడ్ తో స్పష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయాల కంటే కూడా.. తన చుట్టూ ఉన్న కోటరీ సలహాలు.. సూచనలకు బాబు తలొగ్గుతున్నారని.. అదే పార్టీని దెబ్బ తినేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఈ రోజు.. బాబు చుట్టు ఉన్న వారంతా.. రేపొద్దున అధికారం కానీ చేజారితే వారి దారిన వారు వెళ్లిపోతారే తప్పించి.. నిలిచి ఉండేవారు చాలా తక్కువని.. ఆ నిజాన్ని బాబు ఎందుకు గుర్తించటం లేదని ఆవేదన చెందుతున్నారు. పవర్ లో ఉన్నప్పుడు కొన్ని విషయాల్ని లైట్ తీసుకోవటం చంద్రబాబుకు మామూలేనన్న ఎద్దేవా మాటలు కొందరు నేతలు నోటి వెంట రావటం కనిపిస్తోంది. ఇదంతా చూసినప్పుడు.. భవిష్యత్తులో ఏ మాత్రం తేడా వచ్చినా కొసరే కాదు.. అసలు కూడా బాబు వెంట ఉండరన్న భావన కలిగేలా తాజా పరిణామాలు నెలకొన్నాయని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/