Begin typing your search above and press return to search.
బాబు వార్నింగ్ ను లైట్ తీసుకున్నాడు
By: Tupaki Desk | 3 April 2017 5:12 PM GMTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన విస్తరణ ఎంత రచ్చగా మారిందో తెలిసిందే. పదవులు రాని వారు బాబుపై తమకు ఆగ్రహాన్ని ఓపెన్ గా వెళ్లగక్కటమే కాదు.. పార్టీని నాశనం చేసేస్తున్నారంటూ ఓపెన్ గానే తిట్టిపోయటాన్ని మర్చిపోకూడదు. ఊహించని రీతిలో తమ్ముళ్లు చెలరేగిపోతున్న వైనాన్ని కంట్రోల్ చేసేందుకు కిందామీదా పడుతున్నారు. ఆదివారం పెల్లుబుకిన అసంతృప్తి జ్వాలల నేపథ్యంలో సోమవారం ఉదయమే.. పార్టీ ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో కలిసి టెలికాన్ఫరెన్స్ పెట్టేసిన చంద్రబాబు.. ఏదైనా ఇష్యూ ఉంటే తనతో నేరుగా చెప్పాలే కానీ మీడియా ముందు మాట్లాడటం ఏమిటంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇదే రీతిలో కానీ వ్యవహరిస్తే.. తనకు పార్టీనే ముఖ్యమని.. ఎంతటి నిర్ణయానికైనా తాను సిద్ధమని తేల్చి చెప్పేశారు. పార్టీ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వ్యవహరిస్తే.. ఎవరినైనా సరే.. టెన్ మినిట్స్ లో వేటు వేసేస్తానని తేల్చేశారు చంద్రబాబు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చంద్రబాబు ఇంత స్పష్టంగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా.. పట్టించుకోకుండా కొందరు నేతలు తమ లోపలి అసంతృప్తిని ఓపెన్ గా చెప్పేస్తుండటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన పేరును మంత్రివర్గ విస్తరణ సందర్భంగా కనీసం పరిశీలనకు కూడా తీసుకోకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ.మంత్రి పదవి వస్తుందని ఆశించిన ఆయనకు.. అలాంటిదేమీ లేకపోవటంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. నిబద్ధతతో పని చేసినా సీఎం బాబు తనను గుర్తించలేదన్న ఆయన.. మంత్రి పదవి ఇవ్వకపోవటం ద్వారా తనకు రాజకీయాల నుంచి రిటర్మైంట్‌ను ప్రకటించారని వాపోయారు.
తాను మొదట్నించి టీడీపీలోనే కొనసాగుతున్నానని.. తనకు తీవ్ర అన్యాయం చేశారన్న ఆయన.. బాబు వార్నింగ్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా తనకున్న అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కటం గమనార్హం. మరింత.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పార్టీ పరపతిని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసే వారిపై టెన్ మినిట్స్ లో వేటు వేస్తానని చెప్పినా.. అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చూస్తే.. బాబు వార్నింగ్ లన్నీ అంత సీరియస్ కాదా? అన్న క్వశ్చన్ రాక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/