Begin typing your search above and press return to search.
లోటు బడ్జెట్ పెరగడం ఘనత అని చెప్పిన ఎమ్మెల్యే
By: Tupaki Desk | 6 March 2017 9:00 AM GMTఅభివృద్ధి అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే. అంతేనా ఎక్కడికక్కడ అబివృద్ధి పనులు కనిపించాలి. సాధారణంగా అభివృద్ధి అంటే ఇదే. అయితే టీడీపీ పాలనలో అభివృద్ధి అంటే ఇది కాదట. ఇందుకు భిన్నమైనదట. ఇదేదో విపక్ష పార్టీ వైసీపీనో, లేదంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఎదురు దాడికి దిగే లెఫ్టిస్టులో చెబుతున్న మాటలు ఎంతమాత్రం కాదు. సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లుగా పేరు గడించిన టీడీపీ నేతలు చెబుతున్న మాటలు. అది కూడా ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్న ఆ పార్టీ నేత ఒకరు... అభివృద్ధి అంటే ఇదేనంటూ ఓ సరికొత్త అర్ధం వచ్చేలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్లేముందు... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం వెలగపూడిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో నేటి ఉదయం సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర భూభాగంలో తొలి సమావేశాలు... అందులోనూ బడ్జెట్ సమావేశాలు కావడంతో గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ ప్రభుత్వ ప్రాధమ్యాలను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన వెంటనే సభ రేపటికి వాయిదా పడింది.
సభ వాయిదా పడగానే అసెంబ్లీకి అల్లంత దూరాన ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్దకు ఎమ్మెల్యేలు పరుగులు పెట్టారు. ఈ పరుగులో అందరికంటే కాస్త ముందుగా వచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు మీడియా మాట్లాడుతూ... తమ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు. మన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను మన భూభాగంలోనే జరుపుకోవాలన్న తలంపుతో సీఎం చంద్రబాబు.. రికార్డు సమయంలో వెలగపూడిలో తాత్కాలిక అసెంబ్లీ భవన సముదాయాన్ని నిర్మించారని గొప్పలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ... తమ నేత సుపరిపాలనను అందిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఆ ఎమ్మెల్యే గారు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రస్తావించారు. రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక లోటు రూ.16 వేల కోట్లుగా ఉందని చెప్పారు. ఆ ఆర్థిక లోటు టీడీపీ ఐదేళ్ల పాలన ముగిసేలోగా రూ.22 వేల కోట్లకు చేరుకుంటుందని చెప్పారు.
ఇదేదో తాము ఉజ్జాయింపుగా వేసిన లెక్కలు కాదని చెప్పిన ఆ ఎమ్మెల్యే... ఆర్థిక వేత్తలు పక్కాగానే వేసిన అంచనాలుగా చెప్పుకొచ్చారు. అంటే అభివృద్ధి పరుగులు పెడుతున్న రాష్ట్రంలో ఆర్థిక లోటు ఎలా పెరుగుతోందన్నది అర్థం కాని ప్రశ్న. మరి ఈ మాట చెప్పే విషయాన్ని సదరు ఎమ్మెల్యే చంద్రబాబు అనుమతి తీసుకున్నారో? లేదో? చూడాలి. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఆర్థిక లోటు పెరుగుతుందన్న మాట చెబుతానంటే చంద్రబాబు ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి. అయితే అభివృద్ధికి కొత్త అర్థం చెప్పిన ఆ తెలుగు తమ్ముడికి మూడిందన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/