Begin typing your search above and press return to search.
జగన్ తో టచ్ లో ఉన్నదెందరు?
By: Tupaki Desk | 15 Jun 2019 6:22 AM GMTతెలుగు తమ్ముళ్లు తమతో టచ్ లో ఉన్నారంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఓటమితో పీకల్లోతు కష్టాల్లో పడిన బాబుకు.. ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో పలువురు అధికారపక్షంతో టచ్ లో ఉన్నారన్న మాట సీఎం జగన్ నోటి నుంచే స్వయంగా రావటంతో నిద్ర పట్టని పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది. తాము కానీ తలుపులు తీస్తే వచ్చేసేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని.. కానీ తాము ఆ పని చేయమని జగన్ స్పష్టం చేయటం తెలిసిందే.
175 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఏపీ అసెంబ్లీలో జగన్ కు ఏకంగా 151 మంది ఎమ్మెల్యే బలం ఉన్న విషయం తెలిసిందే. కొత్తగా ఎమ్మెల్యేల్ని తీసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. కాకుంటే.. టీడీపీని నిర్వీర్యం చేయాలని భావిస్తే తప్పించి.. ఎమ్మెల్యేల అవసరం లేదు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయం.. గడిచిన రెండు వారాల్లో జగన్ అనుసరిస్తున్న విధానాలు చూస్తున్న తెలుగు తమ్ముళ్లు.. వెంటనే అధికారపార్టీలో మారిపోవటం మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
జగన్ తో పాటు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పలువురు.. తెలుగుతమ్ముళ్లు తమతో టచ్ లో ఉన్నట్లుగా చెప్పటం తెలిసిందే. టీవీ చర్చల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పలువురు తమతో టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని.. జగన్ నుంచి ఓకే అన్న మాట కోసం వారు ఎదురుచూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే..టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎంతమంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కొందరి అంచనా ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది టచ్ లో ఉన్నట్లు చెబితే.. మరికొంతమంది డజను మంది ఎమ్మెల్యేలు పార్టీలోకి రావటానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు హైప్ క్రియేటర్ చేస్తున్నారని.. వారి మైండ్ గేమ్ లో భాగంగానే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లుగా చెబుతున్నారు. మానసికంగా బలహీనం చేయటం.. ఉన్న వారిపై నమ్మకం లేకుండా చేసి.. అనుమానంగా చూడాలన్న వ్యూహంలో భాగంగానే ఈ తరహా వాదనను వినిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఎవరికి వారు వినిపిస్తున్న వాదనల్లో ఎవరి వాదన నిజమన్నది కాలం ఇట్టే తేల్చటం ఖాయం.