Begin typing your search above and press return to search.
వైసీపీతో టచ్‌లో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలు!
By: Tupaki Desk | 26 Jan 2020 2:21 PM GMTశాసన మండలి రద్దు అంశంపై అధికార వైసీపీ - ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై వాడివేడి రాజకీయం సాగుతోంది. శాసన మండలి రద్దుపై సోమవారం నాటి కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకోవచ్చునని - అసెంబ్లీలో దీనిపై చర్చ ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు.
ఇందులో 17 మంది తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని సజ్జల సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ వారిని తీసుకొని తాము ఏం చేసుకుంటామన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టవలసిన అవసరం తమకు లేదన్నారు. డబ్బులతో కొనుగోలు వంటి రాజకీయానికి తాము దూరమని అభిప్రాయపడ్డారు.
జగన్ నవతరం నేత అని, చంద్రబాబు అంతరించిపోతున్న నాయకుడు అన్నారు. మండలి రద్దు ప్రతిపాదనపై అసెంబ్లీలో ఉందని, కానీ ఈ విషయంలో అందరి సలహాలు - సూచనలు తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సమయం ఇచ్చామని తెలిపారు. దీనిని పచ్చ మీడియా వక్రీకరిస్తోందన్నారు.
మండలిని తాము తక్కువ చేస్తున్నట్లుగా చెబుతున్నారని, కానీ తాము అలా చేయడం లేదన్నారు. కానీ మండలిలో మెజార్టీ ఉండటంతో టీడీపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటోందని ఆరోపించారు. గతంలో అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించిన చంద్రబాబు - ఇప్పుడు మండలిలో తనకు బలం ఉందని ప్రజలకు మంచి చేయకుండా అడ్డుకుంటున్నారన్నారు. మండలి చైర్మన్ ను కూడా చంద్రబాబు ప్రభావితం చేశారన్నారు. గ్యాలరీలో కూర్చున్న చంద్రబాబు సామాన్య కార్యకర్త కంటే దారుణంగా ప్రవర్తించారన్నారు.
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి 23 మందికి పైగా ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కొంతమంది ఎంపీలు కూడా పసుపు తీర్థం పుచ్చుకున్నారు. నాడు 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా చేర్చుకున్నందుకు 2019లో టీడీపీకి 23 మంది మాత్రమే మిగిలారని వైసీపీ పలుమార్లు విమర్శలు గుప్పిచింది.