Begin typing your search above and press return to search.
ఇంకో ఇద్దరు ఎమ్మెల్సీలు జంప్..బాబుకు అదిరిపోయే షాక్?
By: Tupaki Desk | 22 Jan 2020 1:47 PM GMTఏపీలో అధికార వైసీపీ - ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి షాకుల పరంపరకు శాసనమండలి వేదికగా మారుతోంది. ఇరు పార్టీలు ఊహించని రీతిలో కౌన్సిల్ లో ఇరకాటంలో పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ - సీఆర్డీఏ రద్దు బిల్లుకు మంగళవారం శాసన మండలిలో షాక్ తగిలింది. మండలిలో ఓటింగ్ నిర్వహించగా...సహజంగానే టీడీపీ సభ్యుల పైచేయి కనిపించింది. అయితే, ఇదే సమయంలో నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పేయడం చర్చకు కారణంగా మారుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్సీలు ఓటింగ్ లో పాల్గొనకపోగా తాజాగా ఎమ్మెల్సీ పోతుల సునీత ఆ పార్టీకి రాజీనామా చేశారని సమాచారం.
వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు మద్దతుగా మండలిలో సునీత ఓటేశారు. తద్వారా టీడీపీకి ఆమె షాక్ ఇచ్చారు. దీంతో విప్‌కు వ్యతిరేకంగా ఓటేసిన సునీతపై చర్యలకు టీడీపీ సిద్దమైంది. అయితే, ఇదే సమయంలో పోతుల సునీత వైసీపీలో చేరేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ పొందినట్లు సమాచారం. సునీత భర్త పోతుల సురేశ్.. దివంగత పరిటాల రవికి ప్రధాన అనుచరుడిగా ఉండేవారు. అంతేకాదు ఆయన అప్పట్లో మావోయిస్టు కీలక నేతగా కూడా చక్రం తిప్పారు.
మరోవైపు, ఎమ్మెల్సీ శమంతకమణి సైతం తన దారి తాను చూసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం - తమ కుటుంబాన్ని లైట్ తీసుకోవడంతో ఆమె సైతం తెలుగుదేశానికి రాజీనామా చేయవచ్చని అంటున్నారు. కాగా, కౌన్సిల్ లో వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ చూస్తుంటే...ఆ పార్టీకే సొంత ఎమ్మెల్సీలు ట్విస్ట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.