Begin typing your search above and press return to search.
టీడీపీ ఎమ్మెల్సీల ఫోన్స్ స్విచ్ఛ్ ఆఫ్.. ఎందుకంటే?
By: Tupaki Desk | 4 Aug 2020 1:30 PM GMTటీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి టీడీపీ ఎమ్మెల్సీలకు ఫోన్ వెళ్తే అస్సలు స్పందన లేదని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 90శాతం టీడీపీ ఎమ్మెల్సీల ఫోన్ లు వాళ్ల పీఏల ఫోన్లు స్విచ్ఛ్ ఆఫ్ లో ఉన్నాయట..
ఇటీవల అమరావతి రాజధాని తరలింపును నిరసిస్తూ చంద్రబాబు , టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాజీనామాలకు మొగ్గుచూపిన సంగతి తెలిసిందే.. దీంతో కావాలంటే మీరు రాజీనామా చేయండని.. మేము మాత్రం చేయమని స్విచ్ఛ్ ఆఫ్ పెట్టుకున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మూడు రాజధానుల సెంటిమెంట్ టీడీపీ ఏమాత్రం లేదని.. ఇప్పుడు అంతా ప్రజలు కరోనా వల్ల ఆర్థికంగా కుదలైన పరిస్థితి గురించే ఆలోచిస్తున్నారని.. అందుకే రాజీనామాలతో లాభం లేదని టీడీపీ ఎమ్మెల్సీలు రాజీనామాకు దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యారట.. రాజకీయంగా గ్రామాల్లో చప్పగా ఉందని.. ఈ టైంలో రాజీనామాలు చేసేది లేదని లోకేష్ కు టీడీపీ ఎమ్మెల్సీలంతా తెగేసి చెప్పారని టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.