Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు టీడీపీ ఎమ్మెల్సీల షాక్?
By: Tupaki Desk | 12 Feb 2020 3:30 PM GMTకొద్ది రోజుల క్రితం శాసన మండలిలో టీడీపీ సభ్యుల రసాభాస దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. టీడీపీ నేతల ఓవరాక్షన్ వల్ల జగన్ సర్కార్ ఏకంగా మండలి రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఏదో హంగామా చేసి మండలిలో పై చేయి సాధిద్దామనుకున్న టీడీపీకి అసలుకే ఎసరు వచ్చింది. లాంజ్ లో నుంచి చంద్రబాబు డైరెక్షన్....కొందరు టీడీపీ ఎమ్మెల్సీల ఓవరాక్షన్ ...వెరసి తమ పదవులు పోయే పరిస్థితి వచ్చిందని కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు లోలోపల సతమతమవుతున్నారట. ఈ క్రమంలోనే గోడ దూకి వైసీపీలోకి జంప్ చేద్దామని కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు చూస్తున్నారట. మండలి రద్దు నేపథ్యంలో సీఎం జగన్ తో విపక్ష ఎమ్మెల్సీలు రహస్యంగా భేటీ అయ్యారట.
చంద్రబాబుకు ఝలక్ ఇచ్చేందుకు కొందరు టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై చతికిలబడ్డ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎమ్మెల్సీలు కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారట. టీడీపీ ఆవేశపడి మండలి రద్దు వరకు తెచ్చుకుందని.... టీడీపీ వల్ల తమ పదవులు పోతున్నాయని రెబల్ ఎమ్మెల్సీలు అభిప్రాయపడుతున్నారట. పదవులు వదులుకునేందుకు సిద్ధంగా లేని మెజారిటీ టీడీపీ ఎమ్మెల్సీలు...వైసీపీతో కలిసి ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారట. ఇండిపెండెంట్ సభ్యులైన పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో కలిసి టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లాలని నిర్ణయించుకున్నారట.
అయితే, ప్రస్తుతం పీడీఎఫ్ ఎమ్మెల్సీల తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీలు.....జగన్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే.....గోడ దూకేందుకు రెడీగా ఉన్నారట. ప్రస్తుతానికి మండలి రద్దు నిర్ణయాన్ని అలా కోల్డ్ స్టోరేజీలో ఉంచేసే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు ప్లాన్ చేస్తున్నారట. కుదిరితే మండలిలో టీడీపీని వైసీపీలో విలీనం చేసేంత మందిని కూడగట్టాలని కొందరు ఎమ్మెల్సీలు భావిస్తున్నారట. మండలి రద్దు సమయంలోనూ ఇదే తరహాలో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ప్రధానితో సీఎం జగన్ భేటీ నేపథ్యంలో ఈ వ్యవహారంపై సీరియస్ గా చర్చ జరుగుతోందట. మండలి రద్దు నిర్ణయంపై మోడీతో జగన్ చర్చలు జరుపుతున్నారన్న టాక్ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ప్రధానితో భేటీ అనంతరం టీడీపీ - పీడీఎఫ్ ఎమ్మెల్సీలను వైసీపీలో చేర్చుకోవాలా లేదా అన్న విషయంపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారట.