Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు కు టీడీపీ.. ఇరకాటంలో సీఎం జగన్

By:  Tupaki Desk   |   5 March 2020 11:00 AM GMT
సుప్రీంకోర్టు కు టీడీపీ.. ఇరకాటంలో సీఎం జగన్
X
స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ మోకలడ్డుతూనే ఉంది. తాజాగా సుప్రీంకోర్టు కు టీడీపీ వెళ్లడంతో జగన్ ప్రభుత్వం ఇరకాటం లో పడింది. హై కోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. టీడీపీ మాత్రం బీసీలకు అన్యాయం జరుగుతోందని చెబుతూ ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల విషయంలో గురువారం సుప్రీంకోర్టులో టీడీపీ పిటిషన్ వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు తగ్గించడం సరికాదని పేర్కొంటూ పిటిషన్ వేశారు. దీంతో ఏపీలో స్థానిక ఎన్నికలపై ఉత్కంఠ ఏర్పడింది. సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించి విచారిస్తే ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది. టీడీపీ కూడా అదే కోరుకుంటోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ను గురువారం టీడీపీ నాయకులు కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భం గా పంచాయతీ కార్యాలయాలు, నీటి ట్యాంకులు, విద్యుత్‌ స్తంభాలకు వేసిన వైఎస్సార్సీపీ పార్టీ రంగులపై చర్యలు తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఎన్నికలకు గ్రామ వాలంటీర్లను దూరంగా ఉంచాలని తెలిపారు. అయితే టీడీపీ మొదటి నుంచి రిజర్వేషన్ల పై పోరాటం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించడంతో 140 వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతుందని వాపోతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో 16 వేల పదవులను బీసీలకు దూరమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బీసీలను రాజకీయంగా అణగదొక్కే కుట్రలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ వలన రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరగకపోవచ్చు. లేదా పిటిషన్ కొట్టివేస్తే యథావిధి గా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ నిర్ణయమైనా సుప్రీంకోర్టు నిర్ణయం పై ఆధారపడి ఉంది.