Begin typing your search above and press return to search.

కత్తిమహేశ్ వెనుక ఆ టీడీపీ ఎంపీ?

By:  Tupaki Desk   |   20 Jan 2018 2:48 PM GMT
కత్తిమహేశ్ వెనుక ఆ టీడీపీ ఎంపీ?
X
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తమకు మద్దతు పలుకుతాడా? మద్దతు పలకడా? అనేది తర్వాతి సంగతి. పవర్ స్టార్ పవర్ ను అయితే తగ్గించేయాలి.. అనే వ్యూహం ప్రకారం.. చాలా పకడ్బందీ ప్లాన్ ప్రకారమే.. కత్తి మహేశ్ ను తెలుగుదేశం వాళ్లు రంగంలోకి దించారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం తతంగం వెనుక ఒక తెలుగుదేశం ఎంపీ ఉన్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్ ను వీలైనంతగా డీఫేమ్ చేసే వ్యూహంతో కత్తి మహేశ్ ను దించి..అతడికి తమ అనుకూల మీడియా ద్వారా పూర్తి సహకారం ఇవ్వడం కూడా సదరు ఎంపీ వ్యూహ రచన అని తెలుస్తోంది.

పారిశ్రామిక వేత్త కూడా అయిన ఆ ఎంపీ.. అందరినీ పురమాయించి ఈ రచ్చను నడిపిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే పవన్ కల్యాణ్ అభిమాన గణం నుంచి వినిపిస్తున్న మాట ఏమిటంటే.. తామెవరూ కత్తి మహేశ్ కు డైరెక్టుగా ఫోన్ చేయడం కానీ - టీవీ చానళ్లకు అతడి విషయంలో ఫోన్ చేసి హెచ్చరించడం కానీ చేయలేదు అనేది. టీవీ చానళ్లే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాయని.. ఈ కత్తి మహేశ్ వ్యవహారంలో కర్త - కర్మ - క్రియ అంతా టీవీ చానళ్లే అని.. పవన్ కల్యాణ్ అభిమాన ఫేస్ బుక్ గ్రూపుల్లో కూడా ప్రముఖంగా పేర్కొంటున్నారు.

మరి పవన్ ఫ్యాన్స్ నుంచి అలాంటి స్పందన వ్యక్తం అవుతున్నా.. ఈ రచ్చను వీలైనంతగా కొనసాగించే బాధ్యతను తీసుకున్నాయి టీవీ చానళ్లు. అవన్నీ కూడా తెలుగుదేశం అనుకూల మీడియా వర్గాలే కావడం గమనార్హం.

ఇదంతా పక్కా స్కెచ్ అనే టాక్ వినిపిస్తోంది. పవన్ కల్యాణ్ ఏనాటికి అయినా తమకు తలనొప్పే అవుతాడనేది సదరు ఎంపీ భావన. ఇప్పుడు తమ చేతిలో అధికారం ఉంది - పవన్ కల్యాణ్ తమ మిత్రపక్షంగా ఉన్నాడు. ఇలా మిత్రపక్షంగా ఉన్న వ్యక్తిని డీఫేమ్ చేస్తే అనుమానం తమపై రాదు. దాన్ని తెలివిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై కూడా నెట్టేయవచ్చు. అనే వ్యూహం మేరకే.. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను దెబ్బతీసే వ్యూహాన్ని అమల్లో పెట్టారని సమాచారం.

ఒకవైపు కత్తి మహేశ్ ను తాము ప్రోత్సహిస్తూ.. తమ అనుకూల వర్గాల ద్వారా పవన్ కల్యాణ్ పై అతడు రెచ్చిపోయేలా చేస్తూ.. మరోవైపు కత్తి మహేశ్ వైసీపీ ఏజెంట్ అనే ప్రచారాన్ని కూడా తామే చేస్తూ.. మొత్తం గేమ్ ను నడిపిస్తున్నారని సమాచారం. పవన్ కల్యాణ్ ను ఇప్పుడు తామెంతగా దెబ్బతీసినా.. అతడి పై ఎంతటి విషప్రచారం చేయించినా.. అనుమానాలు తమపై రావు అనే కాన్ఫిడెన్స్ తో ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ గేమ్ ఇంకా ఎంత వరకూ వెళ్తుందో వేచి చూడాలి.