Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీకి త‌మ్ముడి సెగ‌.. ఏం జ‌రుగుతోందంటే

By:  Tupaki Desk   |   23 July 2022 3:30 PM GMT
టీడీపీ ఎంపీకి త‌మ్ముడి సెగ‌.. ఏం జ‌రుగుతోందంటే
X
తెలుగు దేశం పార్టీలో చిత్ర‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. కొంద‌రు నేత‌ల‌కు సొంత పార్టీ నాయ‌కులే శ‌తృవు లుగా మారుతున్నారు. వీరిని గుర్తించి. అధినేత‌తో చెప్పి.. అదుపులో పెట్టుకునే అవ‌కాశం ఉంది. అయితే.. సొంత ఇంట్లోనే పోరుంటే? అప్పుడు ఏం చేయాలి? సొంత సోద‌రుడే.. ఎగ‌స్పార్టీ అయితే.. ఏం చేయాలి? ఇదీ.. ఇప్పుడు విజ‌య‌వాడ ఎంపీ కేశినాని విష‌యంలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్న ప‌రిస్థితి.

కేశినేని నాని, ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య వార్‌ ముదిరిపాకాన పడింది. కొద్దిరోజు లుగా విజయవాడ కేంద్రంగా చిన్ని వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. చాలా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావడంతో ఈ కార్యక్రమాలకు రాజకీయ రంగుప‌డింది. అదే సమయంలో గతంలో కేశినేని నానీకి సన్నిహితంగా ఉన్న పలువురు టీడీపీ నాయకులు శివనాథ్‌కు దగ్గరవుతూ వచ్చారు. ఈ పరిణామాలన్నీ కేశినేని బ్రదర్స్‌ నడుమ దూరాన్ని పెంచాయి.

అయితే, తన సోదరుడు నానీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం అనే లక్ష్యాలతో తాను కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని శివనాథ్‌ ప్రకటించారు. నాని మాత్రం తన సోదరుడితో తనకు దూరం ఉందన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ వచ్చారు. కొద్దిరోజుల క్రితం తన సోదరుడు శివనాథ్‌ను ఉద్దేశించి 'నా శత్రువును మీరు ప్రోత్సహిస్తే, మీ శత్రువును నేను ప్రోత్సహిస్తా..' అని వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలు అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేసినవని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 2019 ఎన్నిక ల నుంచి నాని తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెడుతూ వస్తున్నారు. 2019లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి మూడు ఎంపీ స్థానాలు దక్కాయి. విజయవాడ నుంచి ఎంపీగా నాని గెలుపొందారు. ఈ గెలుపు తన ఒక్కడి కారణంగానే తప్ప పార్టీ అండతో కాదన్న అభిప్రాయంలో ఆయన ఉండిపోయారు. దీంతో విజయవాడ నగరంలోని మూడు నియోజకవర్గాల టీడీపీ నాయకులతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గ నాయకులతో నానీకి దూరం పెరుగుతూ వచ్చింది.

అయినా పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు ప్రాధాన్యత ఇస్తూనే వచ్చారు. అయినా కూడా చంద్రబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి జరిగిన సందర్భాల్లో స్పందించలేదు. పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో విజయవాడలో ఉండి కూడా రాలేదు. ఒంగోలులో జరిగిన మహానాడుకు ఎంపీ నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత హాజరుకాలేదు.

మొత్తం మీద తరచూ తన మార్కు వ్యవహారశైలితో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఎంపీ నాని చర్చనీయాంశంగా నిలుస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సొద‌రుడిని మిగిలిన నాయ‌కులు చేర‌దీయ‌డం.. మ‌ద్ద‌తు ఇవ్వ‌డం క‌నిపిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇది ఎంత దూరం వెళ్తుందో చూడాలి.