Begin typing your search above and press return to search.
మోడీ..బాబుల కాపురం అలా సాగుతుందట!
By: Tupaki Desk | 9 March 2018 11:48 AM GMTవెరైటీ వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు ఏపీకి చెందిన టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి. మనసులోని మాటను మొహమాటం లేకుండా చెప్పేసే ఆయన మాటల పుణ్యమా అని తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మాటల్లో దూకుడు తప్పించి చేతల్లో తగ్గించేసిన ఆయన.. తాజాగా మోడీ.. బాబుల మధ్య సంసారం ఎలా ఉండనుందో చెప్పుకొచ్చారు.
తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రంతో పూర్తిగా తలాక్ అయిపోయినట్లేనని వ్యాఖ్యానించారు. భార్య..భర్తలు విడిపోయినంత మాత్రాన పిల్లల అతీగతీ చూడొద్దా అని వ్యాఖ్యానించిన జేసీ.. విడాకులు తీసుకున్న తర్వాత పిల్లల కోసం ఏం చేయాలో ఆలోచించిన రీతిలోనే తమ సంసారం సాగనుందన్నారు. జేసీ వ్యాఖ్యలతో బీజేపీ.. టీడీపీల నడుమ సంబంధాలు ఎప్పటి మాదిరి ఉండవని చెబుతూనే.. టచ్ లో మాత్రం ఉంటామన్న మాటను చెప్పటం గమనార్హం.
జేసీ చెప్పినట్లు తలాక్ అయిపోతే.. ఎన్డీయే నుంచి పూర్తిగా బయటకు వచ్చేయాలి కానీ.. సగం మాత్రం బయటకు రావటంలో అర్థం ఏమిటో? తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి సైతం తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన జేసీ.. జగన్ పార్టీ నేతలు సైతం తమ పదవులకు రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలంటూ సవాలు విసిరారు. జగన్ పార్టీ కెపాసిటీ తేల్చుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన జేసీ.. ఆ పార్టీ నేతల్ని రాజీనామా చేయాలంటున్నారు. సవాలు చేసే పద్ధతి ఇదేనంటారా జేసీ?