Begin typing your search above and press return to search.
నాని చెప్పిన డేగ కథ
By: Tupaki Desk | 24 Nov 2021 7:30 AM GMTపార్టీలో కొత్త రక్తం అవసరమని, ఎప్పటికప్పుడూ మార్పలు చేసుకుంటూ ముందుకు సాగాలని టీడీపీ ఎంపీ కేశినేని నాని తెలిపారు. అందుకే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇద్దామని బాబుతో చెప్పానని ఆయన వెల్లడించారు. కొండపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కోసం జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
విజయవాడ ఎంపీగా నీతి నిజాయతీని నమ్ముతా. ఎవరైనా నా జోలికొస్తే ఊరుకోను. పార్టీ విధానాన్ని పాటిస్తా. నేను అవసరమైతే స్పందిస్తా. నా పని నేను చేసుకుంటా. విజయవాడ అభివృద్దే నా ధ్యేయం. పార్టీకి అవసరమైనప్పుడు రాజకీయం చేస్తా. నాకు ప్రచారం కల్పించమని మీడియాను అడగను. పార్టీ కోసం పని చేస్తా కానీ వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ స్థానంలో కొత్తవాళ్లను చూద్దామని బాబుతో చెప్పా. కొత్త రక్తం ఎక్కించాలి.
డేగను చూసి చాలా నేర్చుకోవాలి. అన్ని పక్షుల కంటే అది ఎత్తులో ఎగురుతోంది. దాని కంటే కింద ఉండే చిన్న పక్షలు, పిట్టలను అది పట్టించుకోదు. దానికి సమవుజ్జీలుగా ఉన్న వాటినే పట్టించుకుంటుంది. దాని ఫోకస్ మొత్తం వేటపైనే ఉంటుంది. అది చనిపోయిన జీవులను తినదు. సొంతంగా వేటాడుకున్నదే తింటుంది. అంటే ఎంగిలి కూడుకు ఆశ పడదు. వయసు మీద పడ్డాక తన ఈకలు తానే పీకేసుకుని కొత్త జవసత్వాలు నింపుకుంటుంది. తనను తాను కొత్తగా మార్చుకుంటుంది. అలాగే పార్టీ కూడా ఎప్పటికప్పుడూ నూతనోత్సహంతో సాగాలి. అందుకే కొత్త రక్తం కావాలి. జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని రాలేదు. నా ఊరికి మంచి చేసుకోవాలనుకున్నా. అది జరిగింది. నా మార్క్ ప్రతి గ్రామంలోనూ పడింది. అందుకు సంతోషంగా ఉన్నా. నా దగ్గరవాళ్లతో, బాబుతో నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని అన్నా. కానీ బయట ఎవరితో చెప్పలేదు.
నా విజయవాడకు నేనెంతో చేశా. నా పార్టీకి చేశా. నైపుణ్యవంతులైన యువ నాయకులను పట్టుకుని పార్టీని ఉత్తమంగా తీర్చిదిద్దాలి. అధికార ప్రభుత్వాన్ని నిలదీయడం లేదనేది సరికాదు. సమయం వచ్చినపుడు స్పందిస్తూనే ఉంటా. అయితే అధికార ప్రతినిధులు.. పార్టీలోని వివిధ స్థాయిలో నాయకులున్నారు. వాళ్లందరూ నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలున్నారు. జాతీయ అధికార ప్రతినిధులున్నారు. నా పని పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు చూసుకోవడం. విజయవాడ ప్రజలకు ఏం కావాలో చూసుకోవడం. అంతే కానీ రోజు అనవసరంగా నేను వేరే వాళ్లను తిట్టి వాళ్లు నన్ను తిట్టి ఈ రాజకీయాలకు నాకు నచ్చవు. అనవసరమైన మాటలు మాట్లాడం. రోడ్లపై పడి కొట్టుకోం కదా.
గతంలో చేసిన ట్వీట్‌పై ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను వివరణ ఇచ్చుకోవాల్సింది నా విజయవాడ ప్రజలకే. వాళ్లకు నేనేంటో తెలుసు. అలా అని ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడలో టీడీపీ నాయకుల్లోని కొందరు వైసీపీతో కలిసిపోయారని అంటున్నారు. కానీ ఆ విషయాన్ని నేను పార్టీకే వదిలేస్తున్నా