Begin typing your search above and press return to search.
మరి.. అలాంటి తమ్ముణ్ని ఇన్నాళ్లు ఎందుకు ఉపేక్షించారు ఎంపీ సర్..!
By: Tupaki Desk | 17 Jan 2023 4:07 PM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని.. తన సొంత తమ్ముడు కేశినేని శివనాథ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భూకుంభకోణాలు, కాల్మనీ, సెక్స్ రాకెట్లను నడిపే నాయకుడు అంటూ.. శివనాథ్‌పై వ్యాఖ్యలు సంధించారు. అంతేకాదు.. ఆయనను దావూద్ ఇబ్రహీం, చోటాషకీల్ వంటి నేరగాళ్ల తో పోల్చారు. ఇలాంటి వారు రాజకీయాల్లోకి వచ్చారన్నారు. అటువంటి వారికి తాను ఎప్పుడు సహకరించనన్నారు. భూకుంభకోణాలు, వడ్డీవ్యాపారంతో కోట్లు సంపాదిం చిన సదరు వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే తానెలా సహకరిస్తానని కూడా ప్రశ్నించారు.
ఈ తరహా నాయకులు రాజకీయాల్లోకి వస్తే దేశ భవిష్యత్తు దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. జిల్లాపార్టీలో ముగ్గురు టీడీపీ నాయకుల వ్యవహార శైలి బాగుండలేదన్నారు. వారికి పార్టీ టికెట్ ఇస్తే తాను సహకరించనన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, లేకుంటే నష్టపోతుందన్నారు. తాను నిర్మొహమాటంగా మాట్లాడతానని, పార్టీకోసం అవసరమైతే ఎన్నికల్లో పోటీచేయకుండా, పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు. తన వ్యవహర శైలి నచ్చని నాయకులు, కార్యకర్తలు తనవద్దకు రావాల్సిన అవసరం లేదన్నారు.
అయితే..ఎంపీ నాని చేసిన ఈ వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ నాయకులే మండి పడుతున్నారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నారంటూ... తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాదు.. ఒకవేళ తన తమ్ముడు అలాంటి వాడని తెలిస్తే.. ఇన్నాళ్లు ఎందుకు ఉపేక్షించారని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికిశివనాథ్ గత రెండేళ్లుగా కరోనా కాలంలోనూ.. పార్టీ తరఫున అనేక కార్యక్రమాలు చేశారు. విజయవాడ వ్యాప్తంగా పేదలకు సేవలు అందిస్తున్నారు.
పార్టీ బ్యానర్ పెట్టుకుని ఆయా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇంత చేస్తున్న తమ్ముడుని చోటా షకీల్ అహ్మద్‌తోను.. దావూద్‌తోనూ ఇప్పుడు పోల్చడం ఏంటని మండి పడుతున్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఆ లక్షణాలను ఎంపీ గుర్తించలేదని ప్రశ్నిస్తున్నారు. తన సీటుకు ఎసరు వస్తుందన్న భయంతోనే ఎంపీ ఇలా.. రోడ్డున పడ్డారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎంపీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా వివాదంగా మారడంతో తమ్ముళ్లు నోటికి పనిచెబుతున్నారు. ఇక, తాడో పేడో తేల్చుకోవడం ఖాయమని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.