Begin typing your search above and press return to search.
మరో పోస్టుతో నాని షాకిచ్చారుగా!
By: Tupaki Desk | 12 Jun 2019 5:13 AM GMTవిజయవాడ ఎంపీ కేశినేని నాని మరో పోస్టు పెట్టారు. గడిచిన కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆయన.. తరచూ తాను పెట్టే పోస్టులతో వార్తల్లో మెరుస్తున్నారు. తానేదో బలంగా చెప్పాలన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ఈ మధ్యన లోక్ సభలో పార్టీ తరఫు చేపట్టాల్సిన బాధ్యతను అప్పగిస్తే.. అది తనకు వద్దని.. ప్రజలు అప్పజెప్పిన ఎంపీ పదవి సరిపోతుందని చెప్పిన ఆయన.. బాబు ఇచ్చిన ఆఫర్ ను రిజెక్ట్ చేశారు.
అది మొదలు తరచూ ఏదో ఒక అంశంపై ఆయన పోస్టులు పెడుతున్నారు. పార్టీకి.. చంద్రబాబుకు కొత్త ఫజిల్ గా మారారు నాని. తాజాగా ఆయనో పోస్టు పెట్టారు. అందులో తన గురించి తాను కీర్తించుకున్న ఆయన.. తనకు భయం అన్నది బ్లడ్ లోనే లేదని పేర్కొన్నారు. ఎవరెన్ని విపరీతార్థాలు తీసినా లెక్క చేయనని చెబుతున్న కేశినేని నాని తాజా పోస్టు సంచలనంగా మారింది.
ఫేస్ బుక్ లో ఆయన పెట్టిన పోస్టును యథాతధంగా చూస్తే..
నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని.
ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు.
నిజాన్ని నిజమని చెబుతాను
అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను.
మంచిని మంచి అనే అంటాను.
చెడును చెడు అనే అంటాను.
న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను
అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను
ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం మాత్రమే తెలిసినవాడిని.
నిండుసభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన వాడిని నేను
నిండు సభలోమోడీని నిలదీసిన వ్యక్తిని.
భయం నా రక్తంలో లేదు.
రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు.