Begin typing your search above and press return to search.
నేనా... టీడీపీని వీడడమా
By: Tupaki Desk | 4 Dec 2017 2:57 PM GMTవిభజన సమయంలో పార్లమెంటులో రోజుకో వేషం వేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ గత కొన్నాళ్లుగా ఆ పార్టీలో ఇమడలేకపోతున్నారు. పార్టీలో ప్రాధాన్యం తగ్గుతుండడంతో ఆయన చాలాకాలంగా బయటపడాలనే యోచనలో ఉన్నారనే ప్రచారం కొన్నాళ్లుగా సాగుతోంది. దాన్ని ఆయన ఖండిస్తూనే వస్తున్నారు. తాజాగా ఆయన దానిపై మరోసారి వివరణ ఇచ్చారు. తాను టీడీపీలోనే ఉంటానని చెప్పిన ఆయన తనను రాజకీయాల్లోకి తెచ్చింది కూడా చంద్రబాబేనని, వైఎస్ పిలిచినా తాను వెళ్లలేదని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా మోదీ ప్రభుత్వంపై ఆయన సెటైర్లు వేశారు.
తానంటే గిట్టని వారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకి, తనకు మధ్య గ్యాప్ రాదని ఆయన చెప్పారు. గతంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కులం కోసం ఏం చేశారని ఎస్సీలంతా తనను నిలదీశారని.. దాంతో అప్పట్లో కాస్త తీవ్రంగా స్పందించానే కానీ, టీడీపీని వీడే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయన పోలవరం గురించి మాట్లాడుతూ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. మూడున్నరేళ్లుగా పార్లమెంటులో ఏమీ మాట్లాడలేకపోతున్నామని.. కేంద్రంలో ఉన్నది మిత్రపక్షం కావడంతో ఏమీ అనలేకపోతున్నామన్నారు. నరేంద్ర మోదీ ఖాళీ విస్తరాకు ఎదురుగా పెడితే, దాన్ని చూస్తూ కూచోవాలని అంటూ వెటకారమాడారు. రాష్ఱ్టాన్ని ఏ విధంగా బాగు చేయాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని... ఆయన ఓపిగ్గా ఎదురుచూస్తున్నారని చెప్పారు.