Begin typing your search above and press return to search.

శివ‌ప్ర‌సాద్ వేషాలు ఓకే...విష‌యం ఏది?

By:  Tupaki Desk   |   28 March 2018 7:59 AM GMT
శివ‌ప్ర‌సాద్ వేషాలు ఓకే...విష‌యం ఏది?
X
ఏపీకి ప్ర‌త్యేక హోదా, విభ‌జ‌న హామీల అమ‌లు కోసం కేంద్రంపై వైసీపీ - టీడీపీ ఎంపీలు పార్ల‌మెంటు వెలుప‌ల‌ - లోప‌ల కొద్ది రోజులుగా ఆందోళ‌న‌లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా సినీ న‌టుడు - చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ రోజుకో వేషం వేస్తూ పార్ల‌మెంటు వెలుపల వినూత్న త‌ర‌హాలో నిర‌స‌న తెలుపుతోన్న విష‌యం విదిత‌మే. చీర కట్టుకుని మహిళ గెటప్ లో - స్కూల్ కు వెళ్లే పిల్లాడిలా యూనిఫామ్ లో - చేతిలో వలతో నెత్తికి టోపీతో మ‌త్స్య కారుడిలా - భుజంపై కుండ - చేతిలో కర్రతో సత్య హరిశ్చంద్ర అవతారంలో - కుర్రో.. కుర్రు.. అంటూ కోయదొర గెటప్ లో - రైతు గెటప్ లో - చేతిలో బైబిల్ పట్టుకుని చ‌ర్చి ఫాద‌ర్ లా - ఎన్టీఆర్ గెటప్ లో - పోతురాజు వేషంలో - మెడలో పూలమాల - శ్రీకృష్ణుడి వేషధారణలో....శివ ప్ర‌సాద్ వినూత్న నిర‌స‌న తెలుపుతున్నారు. తాజాగా, నేడు నార‌దుడి వేషంలో శివ‌ప్ర‌సాద్ పార్ల‌మెంటుకు వ‌చ్చారు. నార‌దుడి ఊత‌ప‌ద‌మైన న‌మో నారాయ‌ణ‌కు శివ‌ప్ర‌సాద్ స‌రికొత్త భాష్యం చెప్పారు.

న‌మో అంటే న‌రేంద్ర మోడీ అని, `నారా`య‌ణ అంటే చంద్ర‌బాబునాయుడ‌ని ఆయ‌న అన్నారు. అయితే, న‌మో - నారా ల క‌ల‌యిక లో ఏపీకి ప్ర‌త్యేక హోదాతో రావ‌డంతోపాటు విభ‌జ‌న హామీలు కూడా నెర‌వేరుతాయ‌ని - ఏపీకి ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని తాను ఆశించాన‌ని చెప్పారు. కానీ, ఇచ్చిన మాట‌ను న‌మో త‌ప్పార‌ని, దీంతో ఆ ఆశ‌లు అడియాశ‌లయ్యాయ‌ని ఆయ‌న అన్నారు. అయితే, శివ ప్ర‌సాద్ గెట‌ప్ ల పై సోష‌ల్ మీడియాలో భిన్న స్పంద‌న‌లు వ‌స్తున్నాయి. వినూత్న త‌ర‌హాలో నిర‌స‌న తెలుపుతున్న శివ‌ప్ర‌సాద్ పై కొంత‌మంది పాజిటివ్ కామెంట్స్ చేయ‌గా మ‌రికొంద‌రు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా రోజుకో గెట‌ప్ లో రావ‌డం వ‌ల్ల ప‌బ్లిసిటీ దొరుకుతోంద‌ని, ఇలా వేషాల‌తో కాలం గ‌డిపేయ‌డం వ‌ల్ల ఏమ‌న్నా ఉప‌యోగం ఉందా అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలా వేషాలు వేసే బ‌దులు....ఏపీకి ప్ర‌త్యేక హోదా సాధించేందుకు నిర్మాణాత్మ‌కంగా ఏదైనా చేయాల‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు. ఇక‌నైనా, ఈ త‌ర‌హా వేషాలు మాని సీరియ‌స్ గా ఆలోచించాల‌ని, కేంద్రంపై మ‌రింత ఒత్తిడిని పెంచి విభ‌జ‌న హామీలు నెర‌వేర్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని కోరుతున్నారు.