Begin typing your search above and press return to search.
యనమలా..? ఈ చర్చలతో హోదా వస్తుందా?
By: Tupaki Desk | 5 March 2018 5:14 PM GMTకేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశామని యనమల రామకృష్ణుడు చెప్పారు. అరుణ్ జైట్లీతో భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని విషయాలనూ ఆయనకు తెలిపామన్నారు. రెవెన్యూ లోటు భర్తీ - పారిశ్రామిక రాయతీలపై జైట్లీకి వివరించామనీ, అలాగే రాష్ట్రంలో పరిస్థితిని కూడా ఆయనకు వివరించామని యనమల చెప్పారు. రాష్ట్రానికి 16వేల కోట్ల రెవెన్యూ లోటు నిధులు రావాల్సి ఉందని యనమల అన్నారు.
విభజన సమస్యలపై చర్చ జరిగిందని అన్ని విషయాలనూ జైట్లీకి వివరించామని యనమల రామకృష్ణుడు తెలిపారు. కాగా యనమలతో పాటు సుజనా చౌదరి - రామ్మోహన్ నాయుడు ఏపీ విభజన సమస్యలపై జైట్లీకి వివరించారు. ఇతర రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని యనమల అన్నారు.
రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడినట్లు రామ్మోహననాయుడు తెలిపారు. రాష్ట్ర పరిస్థితులను స్పష్టంగా వివరించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు రావాల్సి ఉందని అన్నారు. అయితే... నాలుగేళ్లుగా ఇలాంటి చర్చలు ఎన్నో జరుగుతున్నాయని.. ఫలితం లేని చర్చల వల్ల ఏం లాభమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.