Begin typing your search above and press return to search.
టీడీపీ కవరింగ్ దీక్షలు
By: Tupaki Desk | 4 July 2018 5:44 AM GMTకడప ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేశ్ దీక్ష చేయడం.. ఆ దీక్ష సందర్భంగా మరో ఇద్దరు ఎంపీలు మురళీ మోహన్ - అవంతి శ్రీనివాస్ లు నోరు జారి అటు ప్రజల ముందు పరువు పోగొట్టుకోవడంతో పాటు చంద్రబాబు నుంచి తిట్లు కూడా తినాల్సి వచ్చింది. వారు ఆ మాటలు అనేటప్పటికి అక్కడ చాలామంది ఎంపీలున్నారు. వీరి లూజ్ టాక్ మొత్తంగా అందరు టీడీపీ ఎంపీలపైనా పడింది. ఈ నేపథ్యంలోనే నష్టనివారణకు గాను.. జనం దృష్టి మళ్లించేందుకు ఇప్పుడు మరో దీక్ష ఎత్తుకున్నారని వినిపిస్తోంది. రైల్వేజోన్ అంటూ అవంతి శ్రీనివాస్ ఇప్పుడు ఎంపీలందరినీ పోగేసి దీక్ష చేస్తుండడం నష్ట నివారణ చర్యలో భాగమేనని వైసీపీ నేతలు అంటున్నారు.
విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద దీక్ష చేయాలని భావించినా రైల్వే వర్గాలు అనుమతి నిరాకరణతో టీడీపీ నేతలు రూటు మార్చారు. రైల్వే స్టేషన్ కు సమీపంలో కాన్వెంట్ జంక్షన్ వద్ద దీక్షకు దిగారు. నేతలంతా అక్కడ హడావుడి చేస్తున్నారు.
కాగా టీడీపీ నేతలు రైల్వే జోన్ పేరిట విశాఖలో దీక్ష చేస్తుండడం వెనుక ఇతర కారణాలూ వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో తిరుగుతుండడం... వైసీపీ అదినేత జగన్ పాదయాత్ర కూడా త్వరలో విశాఖ చేరనుండడంతో టీడీపీ ఈ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీల యాక్టివిటీ ఎక్కువగా ఉండడంతో తామూ థీటుగా జనంలోకి వెళ్లాలన్న ఉద్దేశమే తప్ప రైల్వేజోన్ పై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.