Begin typing your search above and press return to search.
ఉక్కుదీక్షపై టీడీపీ ఎంపీల వీడియో వైరల్
By: Tupaki Desk | 29 Jun 2018 6:15 AM GMTకంటి ముందు కనిపించేవన్నీ నిజాలు కావన్న విషయం తెలిసినా.. నిజమేమో అన్న భావన కలిగేలా చేస్తుంటారు రాజకీయ నాయకులు. తమ రాజకీయ స్వార్థం కోసం ప్రజల్ని.. వారి భావోద్వేగాల్ని సమిధలుగా చేసుకొని తాము అనుకున్నది చేస్తుంటారు. ఏనాడు కడపలో ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడని సీఎం రమేశ్.. ఏకంగా దీక్ష చేయటం ఒక ఎత్తు అయితే.. బీపీ.. షుగర్ ఉన్న ఆయన పది రోజులుగా దీక్ష చేస్తున్నా ఎలాంటి అనారోగ్య పరిస్థితి ఎదురు కాకపోవటం మరో ఎత్తు.
అంతేనా.. కడపలో తమ తోటి ఎంపీ చేస్తున్న దీక్షపై సాక్ష్యాత్తు టీడీపీ ఎంపీలు ఢిల్లీలో చేసుకున్న ఎటకారానికి సంబంధించిన వైరల్ వీడియో క్లిప్ చూస్తే.. ప్రజా సమస్యల మీద వారికున్న కమిట్ మెంట్ ఏ పాటిదన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. టీడీపీని ముంచేయటానికి ఎవరో అక్కర్లేదని.. తమ మనసుల్లో ఉండే దుర్మార్గం.. ప్రజల పట్ల వారికుండే చులకనే ఆ పార్టీని ముంచేస్తుందన్న వైనం తాజా వైరల్ వీడియోను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.
కడపకు ఉక్కు పరిశ్రమ తేవాలంటూ సీఎం రమేశ్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దీక్షలతో ఏమీ కాదంటూ తేల్చేయటమేకాదు.. ఉక్కు..తుక్కు అంటూ తేలిగ్గా తీసేసి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లాంటోళ్లు రాజకీయాల్లో ఉన్నంత కాలం బాగుపడదని చెప్పక తప్పదు.
ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదన్నది.. ఉద్యమం మొదలెట్టిన కేసీఆర్ కు కూడా తెలుసు. అలా అని ఆయన ఎప్పుడు కాడిని వదిలేయలేదు. నేను కాకుంటే నా బిడ్డల కాలానికైనా తెలంగాణను సాధించితీరుతామన్న మాటను చెప్పేవారు. ఏపీలో మాదిరి తెలంగాణలో జేసీ లాంటి ఎటకారాలు చేసే నేతలు ఉండరు. ఒకవేళ ఉన్నా.. అలాంటి నేతల నోటికి ప్రజలే తాళాలు వేస్తారు. ఈ కారణంతోనే తెలంగాణ రాదన్న విషయం తెలిసినా.. ఆ మాటను మాట్లాడేందుకు సుతారం ఇష్టపడని వైనం తెలిసిందే.
వస్తుందా? రాదా? అన్నది పక్కన పెట్టి.. సాధిస్తామని ముందుకు వచ్చిన వారిని మాటలతో గేలి చేసే కన్నా.. మౌనంగా ఉండటం ఉత్తమం. ఆ విషయంలో తెలంగాణ నేతలకున్న పరిపక్వతతో పోలిస్తే.. ఏపీ నేతలకు చాలా తక్కువని చెబుతారు. జేసీ లాంటోళ్లు జోకులు వేస్తే నేతలతో పాటు ప్రజలు నవ్వుతారే కానీ.. నువ్వు ఎట్లాను.. ఏమీ చేయవు.. చేసేటోళ్లను ఎందుకు నిరుత్సాహపరుస్తావన్న ప్రశ్న వేయరు. అలాంటిదే వేస్తే.. జేసీ లాంటోళ్లు నోరు మూసుకుంటారు. ఇలా ప్రతిదాన్ని రాదు.. సాధ్యం కాదంటూ తేల్చేసే జేసీ.. ఢిల్లీలో ధిలాసాగా కూర్చొని తమ సహచరుడు చేసే దీక్షపై చేసిన కామెంట్ వీడియోలో కనిపిస్తుంది.
అంతేనా.. మర్యాదకు పోతపోసినట్లుగా కనిపించే మరో టీడీపీ ఎంపీ మురళీమోహన్ సంగతే చూద్దాం. ఆయన అయితే దారుణంగా ఎగతాళి చేసేశారు. ఏమండీ.. నాకు ఐదు కేజీల బరువు తగ్గాలని ఉంది.. అవకాశమిస్తే వారం రోజుల దీక్ష చేస్తానంటూ చులకనగా మాట్లాడేశారు. ఈ భేటీలో జేసీ.. గల్లా.. మాగంటి.. రేణుక తదితర నేతలంతా ఉన్నారు. ఓవైపు ఏదో చేసేస్తామంటూ మీడియా ముందు రంకెలు వేసే తెలుగు తమ్ముళ్లు.. గదిలో కూర్చున్నప్పుడు వారెలా మాట్లాడతారన్నది చూస్తే.. ఇందుకు కాదు.. ఏపీ వాళ్లు అంటే అందరికి అంత చిన్నచూపు అన్న భావన కలుగక మానదు. అయినా.. నేతల్ని అని ఏముంది ప్రయోజనం.. అలాంటోళ్లను ఎన్నుకునే ప్రజల్ని అనాలి కానీ..!