Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీలు ఎక్కే గడప దిగే గడప!!

By:  Tupaki Desk   |   16 July 2018 5:40 AM GMT
టీడీపీ ఎంపీలు ఎక్కే గడప దిగే గడప!!
X
పార్లమెంటు సమావేశాలు జరగడానికి ముందునుంచే పార్టీ ఎంపీలను సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. హోదా సాధన - విభజన చట్టంలో పొందుపరచిన హామీల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడిని పెంచేందుకు గాను వారిని మిగతా పార్టీల వద్దకు పంపిస్తోంది. ఏపీకి కేంద్రం చేస్తున్న అన్యాయం - విభజన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని వివరిస్తూ ఆదివారం కాంగ్రెస్‌ - బిజెపి మినహా మిగిలిన పార్టీల అధినేతలు - పార్లమెంటరీ పార్టీ పక్షనేతలకు చంద్రబాబు లేఖలు రాశారు. తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు ఆయా పార్టీల మద్దతు కూడగట్టే పని ఎంపీలకు అప్పగించారు.

టిడిపికి చెందిన ఎంపీలను ఆరు బృందాలుగా విభజించి 18కి పైగా పార్టీ అధినేతలు - పార్లమెంటరీ పక్ష నేతలను కలిసేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభానికి ముందే ఈ బృందాలు అయా పార్టీల ముఖ్యనేతలను కలిసి కేంద్రంపై తమ పార్టీ ప్రవేశపెటనున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాసిన లేఖను ఆయాపార్టీల అధినేతలకు అందించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు కోరనున్నారు. అదే సందర్భంలో కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరుతారు.

టీం 1: ఎంపీలు సుజనా చౌదరి - అవంతి శ్రీనివాస్‌ - జేసి దివాకర్‌ రెడ్డి - శ్రీరామ్‌ మాల్యాద్రితో కూడిన మొదటి బృందం టిఎంసీ - బిజెడి - ఆప్‌ - శిరోమణి అకాలీదళ్‌ పార్టీ అధినేతలను కలువనుంది.

టీం 2: తోట నరసింహం - మాంగంటి బాబు - రవీంద్రబాబులతో రెండో బృందం - సిపిఐ - సిపిఎం - శివసేన - ఎన్‌ సిపి పార్టీల నేతలను కలుస్తుంది.

టీం 3: మూడో బృందంలో ఉన్న సీఎం రమేష్‌ - టిజి వెంకటేశ్‌ - మురళీమోహన్‌ లు అన్నాడిఎంకె - డిఎంకె - జెడిఎస్‌ - ఎస్‌ పి - బిఎస్‌ పి పార్టీ నేతలతో కలుస్తారు.

టీం 4: గల్లా జయదేవ్‌ - రవీంద్రకుమార్‌ - గరికపాటి మోహన్‌ రావులతో కూడిన నాల్గోవ బృందం జెడియూ - ఆర్జేడి పార్టీ నేతలను కలువనున్నారు.

టీం 5: ఐదో బృందంలోని అశోక గజపతి రాజు - కొనకళ్ళ నారాయణ - నిమ్మల కిష్టప్ప - ఎన్‌. శివప్రసాద్‌ లు టిఆర్‌ ఎస్‌ - ఎంఐఎం - కేరళా కాంగ్రెస్‌ నేతలతో భేటి అవనుంది.

టీం 6: ఎంపి రామ్మోహన్‌ నాయుడు - బుట్టా రేణుక - సీతారామలక్ష్మీలతో కూడిన ఆరో బృందం ఎన్‌ ఎల్‌ డి - ఎస్‌ డిఎఫ్‌ - ఆర్పిఎఫ్‌ పార్టీ అధినేతలను కలుస్తుంది.